Best dishwasher in india: ప్రస్తుత బిజీ లైఫ్‌లో కిచెన పనులు అంటే ఎవరికైనా పెద్ద టాస్క్ లా మారుతున్నాయి. ముఖ్యంగా నూనె, మసాలాలతో జిడ్డుపట్టిన గిన్నెలను శుభ్రం చేయడం చాలా టైం పడుతుంది.అయితే ఈ కష్టానికి చెక్ పెట్టడానికి మార్కెట్లో దొరికే కొన్ని రకాల డిష్‌వాషర్లు గొప్ప వరంగా మారాయి. ఇవి శ్రమను, సమయాన్ని తగ్గించడమే కాకుండా నీటిని కూడా చాలా వరకు సేవ్ చేస్తాయి. మరిమన ఇండియన్ కిచెన్లకు సరిపోయే టాప్ 5 బెస్ట్ డిష్‌వాషర్లు, వాటి ధరల వివరాలను ఇప్పుడు చూద్దాం.
మార్కెట్లో బాష్ బ్రాండ్‌కు ఎంతో పేరుంది. ముఖ్యంగా మన ఇండియన్ వంటకాలకు తగినట్లుగా.. దీన్ని ప్రత్యేకంగా ‘ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్’తో డిజైన్ చేశారు. దీని వల్ల నూనె, మసాలాలతో జిడ్డుపట్టిన గిన్నెలు, కడాయిలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.47,500 నుంచి రూ.49,000 వరకు ఉంటుంది. 13 ప్లేస్ సెట్టింగ్స్, తక్కువ నీటి ఖర్చు, సైలెంట్ వర్కింగ్ మోటార్ దీని ప్రత్యేకతలు.
ఇండియన్ కిచెన్ అవసరాలకు తగ్గట్టుగా అప్లయన్సెస్ తయారు చేయడంలో ఐఎఫ్‌బి ముందుంటుంది. ఈ డిష్‌వాషర్ 14 ప్లేస్ సెట్టింగ్‌లతో ..వస్తుంది కాబట్టి పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అంతే కాకుండా ఇందులో .. ఉండే 360-డిగ్రీ జెట్ స్ప్రే టెక్నాలజీ గిన్నెలకు ఉన్న మొండి మరకలను పూర్తిగా వదిలిస్తుంది. దీని ధర సుమారు రూ.37,990 నుంచి రూ. 40,000 మధ్య లభిస్తుంది. పవర్ స్టీమ్ డ్రైయింగ్, హాట్ వాటర్ వాష్ ఫీచర్ దీని ప్రత్యేకతలు.
ఈ డిష్‌వాషర్ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఆప్షన్. తక్కువ టైమ్‌లో గిన్నెలు శుభ్రం చేయడానికి ఇందులో ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. ఇది తక్కువ కరెంట్,తక్కువ నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది. దీని ధర సుమారు రూ.27,350 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. ప్రీ-రిన్స్ అవసరం లేని ఇంటెన్సివ్ క్లీనింగ్ దీని ప్రత్యేకత.
కిచెన్ అప్లయన్సెస్‌లో ఫేబర్ మంచి నమ్మకమైన బ్రాండ్. ఈ 12 ప్లేస్ సెట్టింగ్స్ డిష్‌వాషర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది.ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ , మసాలా మరకలను ఈజీగా వదిలించే హైజీన్ వాష్ ప్రోగ్రామ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. దీని ధర సుమారు రూ.27,890 నుంచి రూ. 31,000 మధ్య ఉంది. ఎకో-ఫ్రెండ్లీ వాటర్ సేవింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత.
Also Read: నాయిస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2299కే..డోంట్ మిస్
లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునేవారికి ఎల్జీ డిష్‌వాషర్ అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. ఇది ట్రూస్ట్రీమ్ టెక్నాలజీతో పని చేస్తుంది, దీని వల్ల గిన్నెలు ఎలాంటి మరకలు లేకుండా తలల మెరిసిపోతాయి. వై-ఫై కనెక్టివిటీ ఉండటం వల్ల దీన్ని స్మార్ట్‌ఫోన్ నుంచే ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. దీని ధర సుమారు రూ.45,000 నుంచి రూ. 72,990 వరకు ఉంటుంది. క్వాడ్‌వాష్ మల్టీ-మోషన్ స్ప్రే ఆర్మ్స్, ఆటో ఓపెన్ డోర్ దీని ప్రత్యేకతలు.
ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య , మీ బడ్జెట్‌ను బట్టి సరైన డిష్‌వాషర్‌ను ఎంచుకుంటే.. కిచెన్ పనులు చిటికెలో పూర్తవుతాయి. ఇవి మీ టైం ఆదా చేయడమే కాకుండా, గిన్నెలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతాయి.