E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ కొనేముందు ఇవి తెలియకపోతే తప్పులో కాలేసినట్లే.. రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!

ఫ్రిడ్జ్ కొనేముందు ఇవి తెలియకపోతే తప్పులో కాలేసినట్లే.. రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!
Advertisement

Best Double Door Refrigerators: ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎక్కువ డబ్బులు పెడితేనే మంచి ఫీచర్లు వస్తాయనుకోవడం పొరపాటే. కొన్నిసార్లు బడ్జెట్ ధరలోనే మన అవసరాలకు సరిపోయే అద్భుతమైన ఆప్షన్లు దొరుకుతాయి. ఒకవేళ మీ బడ్జెట్ రూ.30,000 లోపు ఉంటే.. చిన్న లేదా మీడియం సైజ్ కుటుంబాలకు సరిపోయే అనేక 3-స్టార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు మార్కెట్లో ఉన్నాయి. తక్కువ విద్యుత్ వినియోగం, పవర్ కట్ అయినప్పుడు కూలింగ్ పోకుండా ఉండే ఫీచర్లు ఉన్న 5 ఉత్తమ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Whirlpool IF INV 278

తక్కువ స్థలంలో ఇమిడిపోయే ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి 235 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ వర్ల్‌పూల్ మోడల్ సరిపోతుంది. ఇది ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో పనిచేస్తుంది. కాబట్టి.. కూలింగ్ అవసరానికి తగ్గట్టుగా సర్దుబాటు అవుతుంది. ఇందులో ఉన్న కన్వర్టబుల్ ఫ్రీజర్ వల్ల అవసరమైనప్పుడు ఫ్రీజర్‌ను సాధారణ ఫ్రిడ్జ్‌లా వాడుకోవచ్చు. తరచూ విద్యుత్ నిలిచిపోయే ప్రాంతాల్లో ఉండే వారికి దీని 12 గంటల కూలింగ్ రిటెన్షన్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

Samsung RT40H28U3FHL

Advertisement

రోజువారీ ఇంటి అవసరాలకు 236 లీటర్ల సామర్థ్యం ఉన్న శాంసంగ్ ఫ్రిడ్జ్ ఒక నమ్మకమైన ఛాయిస్. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో పనిచేసే ఈ మోడల్ ఏడాదికి కేవలం 200 యూనిట్ల కరెంట్‌ను మాత్రమే తీసుకుంటుంది. ఇందులో ఉన్న ఆల్ అరౌండ్ కూలింగ్ సిస్టమ్ ఫ్రిడ్జ్ మూలమూలకూ సమానంగా చల్లదనాన్ని అందిస్తుంది. కూరగాయలు పాడుకాకుండా ఉండటానికి మోయిస్ట్ ఫ్రెష్ జోన్, ప్రత్యేకమైన బాటిల్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: కేకులు, తందూరీలు ఇంట్లోనే చేసుకోవాలంటే.. బడ్జెట్‌లో లభించే టాప్ కన్వెక్షన్ ఓవెన్లు ఇవే!

IFB IFBFF-291CYOSETM

Advertisement

కరెంట్ పోయినా ఎక్కువ సేపు కూలింగ్ తగ్గకూడదు అనుకుంటే 241 లీటర్ల ఈ ఐఎఫ్‌బీ ఫ్రిజ్ బెస్ట్ ఆప్షన్. ఇది ఏకంగా 30 గంటల పాటు కూలింగ్ నిలిపి ఉంచుతుందని కంపెనీ చెప్తోంది. ఇందులో 10-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉండటం వల్ల స్టోరేజ్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. దీనికి కంపెనీ 4 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీ, కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీ అందిస్తోంది.

Godrej RT EONVALOR 280CN RCIF

కరెంట్ బిల్లు తక్కువగా రావాలనుకుంటే.. 244 లీటర్ల గోద్రేజ్ ఏరోన్ వాలర్ ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇది ఏడాదికి దాదాపు 195 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. ఇందులో 6-ఇన్-1 కన్వర్టబుల్ ఫ్రీజర్, ఏఐ కూలింగ్, నానో షీల్డ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తాజా ఉంచడానికి తోడ్పడతాయి.

Bosch CTC29S03GI

కొంచెం పెద్ద కుటుంబం అయితే.. ఎక్కువ గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడానికి పెద్ద ఫ్రిడ్జ్ కావాలనుకుంటే 269 లీటర్ల బాష్ ఫ్రిడ్జ్ సరైన ఎంపిక. వేరియో ఇన్వర్టర్ కంప్రెసర్, మల్టీ-ఎయిర్‌ఫ్లో కూలింగ్ ఉన్న ఈ మోడల్ ఎక్కువ సామాన్లను వేగంగా చల్లబరిచేందుకు సూపర్‌కూలింగ్ మోడ్‌ను అందిస్తుంది. మిగిలిన వాటితో పోలిస్తే ఇది ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఇస్తుంది.

Also Read: ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్.. జియో, Vi, ఎయిర్‌టెల్ టాప్ ప్లాన్స్ ఇవే!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×