E-Paper
Advertisement

పంట పొలాలకే కాదు.. మీ జేబుకూ చిల్లు! ఎల్‌నినో తెస్తున్న ఆర్థిక సంక్షోభం

పంట పొలాలకే కాదు.. మీ జేబుకూ చిల్లు! ఎల్‌నినో తెస్తున్న ఆర్థిక సంక్షోభం
Advertisement

El Niño Impact: పసిఫిక్‌లో వేడి పెరుగుతోంది… ఎల్‌నినో బలపడుతోంది. 2026 చివరి నాటికి ఇది మరింత బలపడొచ్చని అంచనాలు చెబుతున్నాయి. సముద్రం అడుగున భారీగా పేరుకుపోయిన వేడి నీరు పైకి వస్తే… ఎల్‌నినో మరింత తీవ్రం కావచ్చు. అయితే ఇది ఎంత బలంగా మారుతుందన్నదానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు.

పసిఫిక్‌లో మొదలైన వేడి..

Advertisement

ఎల్‌నినో అంటే పసిఫిక్‌లో వేడి పెరగడమే కాదు.. ప్రపంచ వాతావరణం మారడం. వర్షాలు.. ఉష్ణోగ్రతలు.. గాలుల దిశ.. అన్నింటిపైనా ప్రభావం పడొచ్చు. భారత్‌లో అయితే దీని ప్రభావం రుతుపవనాలపై పడే అవకాశం ఉంది. ఎల్‌నినో బలపడే కొద్దీ సాధారణంగా వర్షాలు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రతి ఎల్‌నినో ఏడాది ఒకేలా ఉండదు.

వర్షాలు తగ్గుతాయి.. ధరలు పెరుగుతాయి

Advertisement

వర్షాలు తగ్గితే.. మొదటి రైతుకే ఎఫెక్ట్‌ . పంట దిగుబడి తగ్గొచ్చు.. సరఫరా తగ్గితే ధరలు పెరగొచ్చు. నీటి నిల్వలపై ఒత్తిడి పెరగొచ్చు. అంటే ఎల్‌నినో ప్రభావం.. పొలం నుంచి మార్కెట్‌ వరకు ఉండొచ్చు. ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నాయని IMD చెబుతోంది. మరోవైపు ఇతర సంస్థల అంచనాల ప్రకారం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య వెరీ స్ట్రాంగ్ ఎల్‌నినో వచ్చే అవకాశం 81 శాతం ఉంది. ఇది 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినోల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనా.

ఎల్‌నినో పాకేది ఎక్కడిదాకా?

ఎల్‌నినో ప్రభావం వ్యవసాయంతో ఆగిపోదు. నీటి కొరత పెరిగితే.. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, రవాణా, సరఫరా వ్యవస్థలపైనా ప్రభావం పడొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు ఎల్‌నినోను కేవలం వాతావరణ సమస్యగా కాదు.. ఆర్థిక ముప్పుగానూ చూస్తున్నారు.

Also Read: జీవన్ రెడ్డి సీన్ రిపీట్ కానుందా? హస్తం పార్టీకి సీనియర్ల తిరుగుబాటు సెగ!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×