Long Validity Data Packs: రోజంతా కంటిన్యూగా ఫోన్ వాడకం, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు డేటా త్వరగా అయిపోవడం సాధారణ విషయమే. అలాంటి వారికి లాంగ్ వ్యాలిడిటీ డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం మెయిన్ రీఛార్జ్ ప్లాన్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే, ఇవి అదనపు డేటాను అందిస్తాయి. ప్రస్తుతం ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ డేటా ప్యాక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి జియో, Vi సంస్థలు ఏడాది వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తున్నాయి. జియో రూ.2000 ప్యాక్‌తో 365 రోజుల వ్యాలిడిటీని, 365GB డేటాను ఒకేసారి ఇస్తుంది. రోజుకు దాదాపు రూ.5.47 పడే ఈ ప్యాక్‌లో జియోహాట్‌స్టార్, యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ లైట్ వంటి 15 రకాల OTT యాప్స్ ఉచితంగా లభిస్తాయి. అటు వి (Vi) రూ.1189తో 365 రోజులకు 50GB డేటా ఇస్తుంది. ఇందులో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్లు ఉండవు కానీ, రోజువారీ ఖర్చు రూ.3.25 మాత్రమే పడుతుంది.
Also Read: కేకులు, తందూరీలు ఇంట్లోనే చేసుకోవాలంటే.. బడ్జెట్‌లో లభించే టాప్ కన్వెక్షన్ ఓవెన్లు ఇవే!
ఎయిర్‌టెల్ తక్కువ వ్యాలిడిటీతో ఎక్కువ వినోదాన్ని ఇచ్చే ప్లాన్లపై దృష్టి పెట్టింది. రూ.279 రీఛార్జ్‌తో నెలకు 30GB డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్లు వస్తాయి. అలాగే రూ.200 ప్యాక్‌తో 28 రోజులకు 30GB డేటా, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో పాటు ఇతర OTT బెనిఫిట్స్ లభిస్తాయి. వినోదం ప్లస్ డేటా కావాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్.
ఎక్కువ డేటా అవసరం ఉన్నవారి కోసం Vi రూ.488 ప్యాక్‌ను అందిస్తోంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో 100GB డేటాను ఇస్తుంది. ఇంటి నుంచి పనిచేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు BSNL తక్కువ ధరలోనే రూ.411కే 60 రోజుల వ్యాలిడిటీతో 100GB డేటాను ఇస్తుంది. బడ్జెట్ ధరలో కేవలం డేటా మాత్రమే కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.
మీకు ఏడాది పొడవునా డేటాతో పాటు OTT వినోదం కావాలనుకుంటే.. జియో ప్యాక్ సరిపోతుంది. కేవలం డేటా మాత్రమే చాలు, తక్కువ ధర ఉండాలి అనుకుంటే Vi లేదా బిఎస్‌ఎన్ఎల్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. అయితే ఈ డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ పనిచేయాలంటే మీ నెంబర్‌పై ఒక ఆక్టివ్ బేస్ ప్లాన్ ఉండటం తప్పనిసరి. రీఛార్జ్ చేసుకునే ముందు ఆయా కంపెనీల అధికారిక యాప్‌లలో లేటెస్ట్ వివరాలు ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Also Read: స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? డూప్లికేట్ ఫొటోలు, వీడియోలను ఇలా ఈజీగా డిలీట్ చేయండి!