E-Paper
Advertisement

తక్కువ ధర..సూపర్ డిస్‌ప్లే! మార్కెట్‌లో..హల్ చల్ చేస్తున్న 5 వాచెస్

తక్కువ ధర..సూపర్ డిస్‌ప్లే! మార్కెట్‌లో..హల్ చల్ చేస్తున్న 5 వాచెస్
Advertisement

Fastrack smartwatches: చేతికి ట్రెండీ లుక్ ఇవ్వడంతో.. పాటు ఫిట్‌నెస్‌ను పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసే స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నారా? అయితే.. యూత్ ఫేవరెట్ బ్రాండ్ అయిన ఫాస్ట్‌ ట్రాక్ అందించే.. గాడ్జెట్లు మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్ కేవలం టైమ్ చూడటానికే కాకుండా.. మన హెల్త్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన డివైజ్‌గా మారి పోయింది. కాలేజీ కుర్రాళ్ల నుంచి ఆఫీస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు అందరూ కోరుకునే స్టైలిష్ లుక్, బడ్జెట్‌లో.. అదిరి పోయే ఫీచర్లు ఫాస్ట్‌ ట్రాక్‌లో లభిస్తాయి. ఎంట్రీ లెవెల్ ట్రాకర్ల నుంచి అద్భుతమైన అల్మోడ్ డిస్‌ప్లేల వరకు మార్కెట్లో.. హల్ చల్ చేస్తున్న టాప్-5 బెస్ట్ ఫాస్ట్‌ ట్రాక్ స్మార్ట్‌ వాచ్‌ల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్-5 బెస్ట్ ఫాస్ట్‌ ట్రాక్ స్మార్ట్‌ వాచ్‌‌లు

1. Fastrack Reflex Beat+ :

ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. బేసిక్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ కావాలనుకునే.. వాళ్లకు ఇది సూపర్ ఛాయిస్. రన్నింగ్, వాకింగ్, స్లీపింగ్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఇందులో.. పర్ఫెక్ట్‌గా పని చేస్తాయి. బరువు తక్కువగా.. ఉండటం వల్ల రోజంతా చేతికి పెట్టుకున్నా.. ఎలాంటి ఇబ్బంది కలగదు. కాలేజీ స్టూడెంట్స్‌కు.. ఇది పర్ఫెక్ట్ బడ్జెట్ ఆప్షన్.

2. Fastrack Reflex Vox 2:

Advertisement

ట్రెండీ స్క్వేర్ డయల్ డిజైన్‌తో.. వచ్చే ఈ స్మార్ట్‌ వాచ్ యూత్‌ను.. విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిలోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు, వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ వర్కవుట్ చేసే వాళ్లకు ఎంతో హెల్ప్.. అవుతాయి. స్టైలిష్ లుక్‌తో పాటు.. రోజు వారీ నోటిఫికేషన్స్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కోసం ఇది బెస్ట్.

3. Fastrack Limitless FS2 Pro:

బడ్జెట్ ధరలోనే.. ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే.. వారి కోసమే ఈ లిమిట్‌ లెస్ సిరీస్ ప్రత్యేకంగా డిజైన్ చేసారు. అద్భుత మైన బ్రైట్‌నెస్, క్రిస్టల్ క్లియర్ విజిబిలిటీనిచ్చే.. సూపర్ అల్మోడ్ ఆర్చ్డ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ , ఫంక్షనల్ క్రౌన్ దీనిని మరింత అట్రాక్టీవ్‌గా మారుస్తాయి.

4. Fastrack Astor FS1 Pro / FR2 Pro:

Advertisement

రౌండ్ డయల్ , క్లాసిక్ లుక్ ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ అద్భుతంగా నప్పుతుంది. బిగ్ అల్మోడ్ డిస్‌ప్లే, ఆల్వేస్-ఆన్-డిస్‌ప్లే ఫీచర్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి వచ్చే.. బ్యాకప్ దీని ప్రధాన ప్లస్ పాయింట్. జిమ్ చేసే వారికి, ప్రొఫెషనల్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: రూ.21,799కే..50 ఇంచుల టీవీ, ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

5.Fastrack Xtreme Pro / Mynd:

ప్రీమియం లుక్, మెటాలిక్ ఫినిషింగ్, టాప్-నాచ్ ఫీచర్లు కోరుకునే.. వారి కోసం ఇది అల్టిమేట్ చాయిస్. హై-ఎండ్ అల్మోడ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ హెల్త్ సెన్సార్లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్ దీనిలో.. ఉంటాయి. మీ పర్సనాలిటీని.. నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ఈ వాచ్ లుక్ అద్దిరిపోతుంది.

గమనిక: ఆన్‌లైన్ సేల్స్, ఆఫర్లను బట్టి ఈ స్మార్ట్‌ వాచ్‌ల ధరలు మారుతుంటాయి. కొనే ముందు బ్యాంక్ ఆఫర్లు లేదా డిస్కౌంట్లు చెక్ చేసుకోవడం మంచిది.

Related News

బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

మల్టీటాస్కింగ్ అదరగొట్టాలా? అయితే.. ఈ 5 లెనోవో ల్యాప్‌టాప్స్ మీ కోసమే!

అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?

100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫ్రిజ్..రూ.15వేలలోపు బెస్ట్

బడ్జెట్ ధరలో CMF కొత్త ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు, ఏకంగా 52 గంటల బ్యాటరీ లైఫ్!

Big Stories

Advertisement
×