E-Paper
Advertisement

కారు విండోకి తెల్లటి గుడ్డ.. ఇది దేనికి సంకేతం? ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి?

కారు విండోకి తెల్లటి గుడ్డ.. ఇది దేనికి సంకేతం? ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి?
Advertisement

White Cloth: రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కారు విండో నుండి తెల్లటి గుడ్డ వేలాడుతుండటం సహజంగా చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కారులోని వారు తమ చేతులతో తెల్లటి వస్త్రాన్ని బయటకు చూపిస్తుంటారు. అయితే తడిగా ఉన్న గుడ్డను ఆరేయడానికి ఇలా చేస్తున్నారని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది తప్పు. ఒకవేళ విదేశాల్లో ఇలా ఒక కారు విండోపై తెల్లటి గుడ్డ కనిపిస్తే మాత్రం దాని వెనుక బలమైన కారణమే ఉంటుంది. ఇంతకీ ఇది దేనికి సంకేతం? అలా గుడ్డ కనిపిస్తే ఏం చేయాలి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అత్యవసర సాయానికి సంకేతం

కారు విండో వద్ద తెల్లటి గుడ్డను ప్రదర్శిస్తే దానికి కారులో సమస్య తలెత్తినట్లు అర్థం. కారులోని వారు తమకు సాయం కావాలని తోటి వాహనదారులకు సూచిస్తున్నట్లుగా దాన్ని భావించాలి. సాంకేతిక లోపం, మెకానికల్ సమస్య, ప్రయాణాన్ని కొనసాగించలేని స్థితి ఏర్పడినప్పుడు రోడ్డు పక్కన ఆపిన కార్లకు ఈ రకంగా వైట్ క్లాత్ ను తగిలిస్తారు. అలాంటి సందర్భాల్లో తెల్లని రంగు స్పష్టంగా కనిపించడం వల్ల ఇతర వాహనదారులు, రోడ్డు పెట్రోలింగ్ సిబ్బంది వాహనంలో ఏదో సమస్య ఉందని ఈజీగా గుర్తించేందుకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది.

ఒకవేళ రన్నింగ్ కారులో కనిపిస్తే..

Advertisement

ఆగివున్న వాహనాలకే కాకుండా ప్రయాణంలో ఉన్న కారు నుండి ఒక్కోసారి తెల్లటి గుడ్డను ఊపుతుంటారు. ఇది కారులోని వ్యక్తికి ఏర్పడ్డ అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ముఖ్యంగా వాహనంలో ఉన్నవారికి అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం ఏర్పడినప్పుడు తక్షణ సహాయం కోసం ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇటువంటి సమయంలో ఇతర డ్రైవర్లు సురక్షితమైన దూరాన్ని పాటిస్తూ వారికి మార్గం ఇవ్వడానికి ప్రయత్నించాలి. వారు వేగంగా తమ గమ్యాన్ని చేరుకోవడానికి తమ వంతు సాయాన్ని అందించాలి.

Also Read: కారు డిక్కీలో మహిళ మృతదేహం.. షాకైన స్థానికులు, రంగంలోకి పోలీసులు, హనుమకొండ జిల్లాలో ఘటన

మరి చట్టం ఏం చెబుతోంది?

Advertisement

ఇదిలా ఉంటే వాహనాల్లో తెల్లటి వస్త్రాన్ని అత్యవసర గుర్తుగా ఉపయోగించినప్పటికీ దీనికి చట్టప్రకారం ఎలాంటి అధికారిక గుర్తింపు లేదు. దీనిని ప్రదర్శించినంత మాత్రాన ఒక ప్రైవేట్ వాహనానికి అంబులెన్స్ లేదా అత్యవసర వాహనం లాంటి ప్రత్యేక హక్కులు రావు. కాబట్టి వాహనదారులు తమకు ఏదైనా సమస్య ఏర్పడితే.. తెల్లటి వస్త్రం చూపిస్తూ సమయాన్ని వృథా చేసే కంటే 911 లేదా 108 కి సమాచారం అందించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

Tags

Related News

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్.. BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!

లగ్జరీ కార్లే టార్గెట్.. వీళ్లు కొట్టేసే ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

సింగిల్ ఛార్జ్ తో 679 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

Big Stories

Advertisement
×