E-Paper
Advertisement

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్ర స్థాయిలో విమర్శించిన బావాబామ్మర్దులు.. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను ఆకాశానికెత్తుతుండటం వెనుక పెద్ద చీకటి ఒప్పందం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

అనరాని మాటలు అని.. ఇప్పుడు పొగడ్తలా?

Advertisement

శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో చంద్రబాబును అనరాని మాటలని అవమానించిన బీఆర్ఎస్ నేతలు, ఈ రోజు అదే నోటితో పొగడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికే, చంద్రబాబు ద్వారా రాయబారాలు నడుపుతూ ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు తాపత్రయపడుతున్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీ, బాబుపై మౌనం!

Advertisement

రాత్రింబవళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా అడ్డగోలు అబద్ధాలతో బురదజల్లే బీఆర్ఎస్.. ఏపీ సీఎం చంద్రబాబును గానీ, బీజేపీ నేతలను గానీ కనీసం ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక అసలు రహస్యం ఇదేనని పీసీసీ చీఫ్ గుర్తుచేశారు. తెలంగాణలో రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటూ పెద్ద స్కెచ్ వేశాయని, వారి రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Also Read: ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

Tags

Related News

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

కేంద్రంతో సీఎం రేవంత్ కీలక భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై బిగ్ అప్‌డేట్!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!

Big Stories

Advertisement
×