High suction vacuum cleaner: ఇల్లు ఎప్పుడూ పరి శుభ్రంగా ఉంటేనే.. మనసుకు ప్రశాంతత. అయితే.. రోజూ చీపురుతో ఊడ్చినా మూలల్లో ఉండే.. సూక్ష్మమైన ధూళి అలాగే ఉండి పోతుంది. దీని కోసమే మార్కెట్లోకి..లేటెస్ట్ ఫీచర్లతో.. కూడిన హై-సక్షన్ వాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ వాక్యూమ్ క్లీనర్స్ వివరాలు మీ కోసం.
ఇది మోడర్న్ ఇళ్లలో.. ఎక్కువగా ఇష్ట పడుతున్న బెస్ట్ వాక్యూమ్ క్లీనర్. దీనిలో.. పవర్ ఫుల్ 1900 వాట్స్ మోటార్ ఉంటుంది. ఇది చాలా బల మైన సక్షన్ పవర్‌ను అందిస్తుంది. పవర్ సైక్లోన్ 5 టెక్నాలజీ ఉండటం వల్ల.. గాలి లోని దుమ్మును, చెత్తను వేరు చేస్తుంది. సోఫాలు, కార్పెట్లు, గట్టి నేలలపై పేరుకు పోయిన మురికిని.. ఇది ఇటుకల మీద నీళ్లు చల్లినట్లు తొలగిస్తుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.9398 వరకు ఉంది.
టెక్నాలజీ లవర్స్ ఇది పర్ ఫెక్ట్ ఛాయిస్. ఇది కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ అయినప్పటికీ.. ఇండస్ట్రీ-స్టాండర్డ్ హై-సక్షన్ పవర్‌ను కలిగి ఉంటుంది. దీనిలో.. ఉండే ప్రత్యేక మైన ఎల్‌సీడి స్క్రీన్ ద్వారా ఎంత దుమ్ము పోగైందో.. రియల్ టైమ్‌లో చూసుకోవచ్చు. దీనిలో.. ఉండే లేజర్ టెక్నాలజీ కంటికి కనిపించని సూక్ష్మ ధూళిని కూడా ఇట్టే బయటకు లాగుతుంది. పెట్స్ ఉన్న ఇళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ.42,999 నుంచి రూ. 46,999 వరకు ఉంది.
తడి, పొడి చెత్త రెండింటినీ శుభ్రం చేయాలనుకునే.. వారికి అగారో ఏస్ అద్భుతమైన ఆప్షన్. ఇది 1600 వాట్స్ పవర్‌తో.. పాటు బలమైన 21.5 kPa సక్షన్ పవర్‌ను కలిగి ఉంది. దీనిలో 21 లీటర్ల పెద్ద డస్ట్ ట్యాంక్ లభిస్తుంది. కాబట్టి పెద్ద ఇళ్లకు ఇది సరిగ్గా సరి పోతుంది. ఇందులో.. బ్లోవర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. దీని ధర సుమారు రూ.6,970గా ఉంది.
ప్రముఖ బ్రాండ్ అయిన యూరికా ఫోర్బ్స్ నుంచి వచ్చిన ఈ మోడల్ అద్భుతమైన సక్షన్ పవర్‌ను అందిస్తుంది. ఇది.. బ్యాగ్ లెస్ టెక్నాలజీతో.. వస్తుంది. దీని బరువు చాలా తక్కువ. HEPA ఫిల్టర్ ఉండటం వల్ల.. గాలి శుభ్రంగా ఉంటుంది. ఆటో కార్డ్ వైండింగ్, వివిధ రకాల మల్టీ పర్పస్ యాక్సెసరీస్ దీని ప్రత్యేకత. దీని ధర సుమారు రూ.7,199 వరకు ఉంటుంది.
Also Read: స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్.. 2-ఇన్-1 ల్యాప్ టాప్
జర్మన్ టెక్నాలజీతో.. తయారైన ఈ వాక్యూమ్ క్లీనర్ దాని క్వాలిటీ, ఫర్మార్మెన్స్ పని తీరుకు పేరుగాంచింది. 1000 వాట్స్ శక్తితో పని చేసే.. ఇది, 23 kPa బలమైన సక్షన్ పవర్‌ను కలిగి ఉంటుంది. కార్ కాలుష్యం, సోఫాలు, కార్పెట్లు, హోం అప్లయన్సెస్ సేఫ్టీకి ఇది చాలా బావుంటుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.8,000 నుంచి రూ. 9,500 మధ్య ఉంటుంది.
మీ బడ్జెట్, అవసరాలకు తగినట్టుగా.. వైర్ లెస్ కావాలంటే డైసన్, బడ్జెట్ ధరలో హెవీ డ్యూటీ కావాలంటే.. అగారో లేదా యూరికా ఫోర్బ్స్ ఎంచుకోవడం బెస్ట్. మీ ఇల్లు ఎప్పుడూ సరి కొత్తగా, పరి శుభ్రంగా ఉండాలంటే.. ఈ హై-సక్షన్ వాక్యూమ్ క్లీనర్లలో ఒకదాన్ని ఇంటికి తెచ్చుకోండి.