Dell 14 Plus 2-in-1 review: ప్రస్తుత రోజుల్లో ఆఫీస్ వర్క్, చదువుకోసం లేదా క్రియేటివ్ డిజైనింగ్ కోసం ల్యాప్‌టాప్‌ను తీసుకునేటప్పుడు యూజర్లు అనేక అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒకే ల్యాప్‌టాప్‌ను ల్యాప్‌టాప్‌గా, ట్యాబ్ గా ఉపయోగించుకునే వీలు కల్పించే 2-ఇన్-1 డివైజ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో డెల్ సంస్థ విడుదల చేసిన డెల్ 14 ప్లస్ 2-ఇన్-1 మోడల్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని డిజైన్,ఫర్మామెన్స్ , ఇతర ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ :
ఈ ల్యాప్‌టాప్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా క్లాసిక్‌గా , సింపుల్‌గా ఉంటుంది. దీని బాడీ అల్యూమినియం , ప్లాస్టిక్ మిశ్రమంతో తయారైంది. ఇది కేవలం 1.61 కేజీల బరువుతో.. చాలా తేలికగా ఉండటంతో పాటు, ప్రయాణాలు చేసేవారికి బ్యాగ్‌లో సర్దుకోవడం చాలా ఈజీ అవుతుంది. బలమైన హింజెస్ కారణంగా దీనిని 360 డిగ్రీలు తిప్పి ట్యాబ్లెట్ మోడ్‌లో లేదా టెంట్ మోడ్‌లో అద్భుతంగా వాడుకోవచ్చు.
డెల్ 14 ప్లస్ 2-ఇన్-1 లాప్‌టాప్‌లో 14 ఇంచుల FHD+ (1920 x 1200 పిక్సెల్స్) టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 16:10 ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఈ డిస్‌ప్లే టచ్ రెస్పాన్స్ విషయంలో చాలా చక్కగా పని చేస్తుంది. స్క్రీన్ ఈజీగా తిరగడం వల్ల నోట్స్ రాసుకోవడానికి.. డ్రాయింగ్ చేయడానికి లేదా వీడియోలు చూడటానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దీని రిఫ్రెష్ రేట్ 60Hz మాత్రమే ఉండటం కొద్దిగా నిరాశ కలిగించే అంశం.
ఈ ల్యాప్‌టాప్ పర్ఫామెన్స్ పరంగా కూడా యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా లేదా AMD రైజెన్ ఏఐ ప్రాసెసర్‌ల ఆప్షన్లతో లభిస్తుంది. దీనికి తోడు 16GB LPDDR5X RAM, ఫాస్ట్ 1TB SSD స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేయడం, హెవీ సాఫ్ట్‌వేర్స్ రన్ చేయడం, ఆఫీస్ వర్క్ చేసుకోవడం వంటి వాటిలో ఇది ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ల కోసం ప్రత్యేకమైన NPU సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది.
ఈ ల్యాప్ టాప్ ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. మార్కెట్లో లభించే.. సాధారణ కన్వర్టబుల్ ల్యాప్ టాప్‌లతో పోలిస్తే.. ఇది అద్భుతమైన బ్యాకప్ ఇస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఆఫీస్ పనులు లేదా కాలేజ్ వర్క్ ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే వారికి ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
Also Read: పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !
ఇండియన్ మార్కెట్లో డెల్ 14 ప్లస్ 2-ఇన్-1 లాప్‌టాప్ ప్రారంభ ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ.1,13,499 నుంచి ప్రారంభమవుతుంది. ఆఫర్లు, సేల్స్ సమయంలో దీనిని ఇంకా తక్కువ ధరలకు కొనే అవకాశం ఉంది.
మీకు రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్, మెరుగైన పెర్ఫార్మెన్స్ , ఫ్లెక్సిబుల్ టచ్‌స్క్రీన్ అనుభవం అందించే ల్యాప్ టాప్ కావాలంటే ‘డెల్ 14 ప్లస్ 2-ఇన్-1’ ఖచ్చితంగా కొనాల్సిన మంచి కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.