E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ.. ఈ 5 బెస్ట్ Jabra హెడ్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!

ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ.. ఈ 5 బెస్ట్ Jabra హెడ్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!
Advertisement

Best Jabra headphones for office calls: ఆఫీస్ ఆన్‌లైన్ మీటింగ్స్ లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వల్ల విసిగిపోతున్నారా? అవతలి వాళ్లకు మీ వాయిస్ స్పష్టంగా వినపడటం లేదా? అయితే మీకు ఒక ప్రొఫెషనల్ హెడ్‌సెట్ అవసరం ఎంతైనా ఉంది. ఆడియో రంగంలో గ్లోబల్ లీడర్ అయిన జబ్రా (Jabra), కాల్ క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అద్భుతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), మైక్ టెక్నాలజీతో.. లభిస్తున్న 5 బెస్ట్ జబ్రా హెడ్‌ఫోన్స్, వాటి ఫీచర్లు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 జబ్రా హెడ్‌ఫోన్స్:

ప్రస్తుత హైబ్రిడ్ వర్కింగ్ రోజుల్లో హెడ్‌ఫోన్ అనేది కేవలం పాటలు వినడానికి మాత్రమే కాదు, ఆఫీస్ కమ్యూనికేషన్‌ను ఈజీ చేసే ముఖ్యమైన సాధనం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు సైతం జబ్రా ఆడియో డివైజ్‌లను ఎక్కువగా నమ్ముతాయి. వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 5 టాప్-రేటెడ్ మోడల్స్ ఇవే..

1. Jabra Evolve2 65 Flex:

Advertisement

ట్రావెల్ చేస్తూ వర్క్ చేసే వారికి, హైబ్రిడ్ ఎంప్లాయ్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి ఈజీగా బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. ఇందులో హైబ్రిడ్ ANC ఉంది. ఇది చుట్టుపక్కల ఉండే అల్లరిని పూర్తిగా తగ్గిస్తుంది. దీనిలోని హైడ్-అవే బూమ్ మైక్ వాయిస్‌ను చాలా క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది. దీని ధర సుమారుగా రూ.40,250 నుంచి రూ.42,369 వరకు ఉంటుంది.

2. Jabra Evolve 20 (Wired):

మీరు బడ్జెట్ ధరలో పక్కా ఆఫీస్ అవసరాల కోసం వైర్డ్ హెడ్‌సెట్ వెతుకుతుంటే.. దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదు. ఇది నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్‌తో వస్తుంది. కాల్స్ కంట్రోల్ చేయడానికి ఇన్-లైన్ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ల్యాప్‌టాప్, పిసిలకు ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే..ఇది చాలా అఫర్డబుల్ ధరకు లభిస్తుంది. ఆఫర్లలో దీని ధర రూ.3,500 నుంచి రూ.4,899 మధ్య ఉంటుంది.

3. Jabra Evolve2 55 MS Teams Certified:

Advertisement

మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా జూమ్ యాప్స్ ఎక్కువగా వాడేవారికి ఈ హెడ్‌సెట్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఇది డ్యూయల్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. అంటే ఒకేసారి ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయవచ్చు. శక్తివంతమైన 28mm స్పీకర్లు , ప్రొఫెషనల్ గ్రేడ్ మైక్ దీని సొంతం. దీని మార్కెట్ ధర సుమారుగా రూ.33,240 నుంచి రూ. 34,999 వరకు ఉంది.

4. Jabra Elite 10 Gen 2 (Wireless Earbuds):

మీకు హెడ్‌ఫోన్స్ బరువు వద్దు, లైట్ వెయిట్ ఇయర్ బడ్స్ కావాలనుకుంటే జబ్రా ఎలైట్ 10 జెన్ 2 బెస్ట్ ప్రీమియం ఆప్షన్. ఇది డాల్బీ అట్మోస్ స్పేషియల్ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 6 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్లు ఉన్నాయి. కాబట్టి ఇవి విపరీతమైన గాలి లేదా ట్రాఫిక్ సౌండ్స్ ఉన్నా మీ వాయిస్‌ని మాత్రమే స్పష్టంగా వినిపిస్తాయి. దీని స్మార్ట్ కేస్ అదనపు ప్లస్ పాయింట్. దీని ప్రీమియం ఫీచర్ల కారణంగా దీని ధర ఆఫర్లలో రూ.24,999 నుంచి రూ.34,557 వరకు మారుతుంటుంది.

Also Read: చిమ్నీలపై వేలల్లో డిస్కౌంట్? అమెజాన్ ప్రైమ్ డే సేల్ అస్సలు మిస్సవ్వొద్దు

5. Jabra Evolve 65 UC Duo:

కాల్ సెంటర్లలో లేదా బిజీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో ఎక్కువ సేపు మాట్లాడే వారికి ఇది చాలా కాలంగా నమ్మకమైన మోడల్. ఇందులో ‘బిజీలైట్’ఇండికేటర్ ఉంటుంది. మీరు కాల్‌లో ఉన్నప్పుడు ఇది రెడ్ కలర్‌లోకి మారి, ఇతరులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అలర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే..ఆన్‌లైన్ మార్కెట్లో దీని ధర దాదాపు రూ.15,199 నుంచి రూ. 15,999 మధ్య అందుబాటులో ఉంది.

మీ బడ్జెట్ , అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి. తక్కువ బడ్జెట్ అయితే Evolve 20, అల్టిమేట్ ఆఫీస్ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ కావాలంటే.. Evolve2 65 Flex ఉత్తమమైనవి. ప్రొఫెషనల్ కాల్ క్వాలిటీ కోసం యూజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్న బ్రాండ్ జబ్రా మాత్రమే.

Related News

ఒకే చెట్టు.. 300 ఏళ్లపాటు కలప.. 600 ఏళ్ల నాటి అద్భుత టెక్నాలజీ!

మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!

తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!

చిమ్నీలపై వేలల్లో డిస్కౌంట్? అమెజాన్ ప్రైమ్ డే సేల్ అస్సలు మిస్సవ్వొద్దు

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

Big Stories

×