E-Paper
Advertisement

కాంగ్రెస్ డ్రామాలను సహించేదే లేదు.. ఇండీ కూటమిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు

కాంగ్రెస్ డ్రామాలను సహించేదే లేదు.. ఇండీ కూటమిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని, పార్లమెంట్‌ను మాక్ పార్లమెంట్ పేరిట హేళన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు శాంతికుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓఎస్ రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సుప్రీంకోర్టును అవహేళన చేస్తూ రిటైర్డ్ జడ్జీలతో పిటిషన్లు తీసుకుంటూ కంగారూ కోర్టు తరహా విచారణలు నడిపిన చరిత్ర కాంగ్రెస్‌దని రాంచందర్ రావు మండిపడ్డారు. 2010లో వేతనాల పెంపు కోసం లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ లోపలే మాక్ పార్లమెంట్ నిర్వహించినప్పుడు.. అప్పటి స్పీకర్ మీరా కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఒక పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయమని హెచ్చరించారని, స్వయంగా సోనియా గాంధీ సైతం దానిని ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ అని తీవ్రంగా తప్పుబట్టారని గుర్తుచేశారు.

స్పష్టమైన డీపీఆర్ ఏది?

Advertisement

నాడు అలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, నేడు అదే తరహాలో మాక్ పార్లమెంట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఇళ్లు కూల్చితే మాత్రం సహించేది లేదని రాంచందర్ రావు హెచ్చరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ కార్పొరేషన్‌కు రూ. 750 కోట్ల అంచనా వ్యయం చూపించి చివరకు రూ.3 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అంచనాలు చెబుతూ స్పష్టమైన డీపీఆర్, బడ్జెట్ కేటాయింపులు చూపకుండా ముందుకు వెళ్తోందని ఆరోపించారు.

నవంబర్ 2వ తేదీన అమిత్ షా పర్యటన..

Advertisement

నవంబర్ 2వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వరకు చారిత్రక మహా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఇండీ కూటమి ర్యాలీ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించలేదని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను రాంచందర్ రావు తిప్పొకట్టారు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ప్రత్యేక రైళ్ల బుకింగ్ ప్రక్రియ నెలల ముందుగా జరగాలని, నిర్ణీత రుసుము చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. రైల్వేపై అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని ఆయన సూచించారు. ఈ మీడియా సమావేశం అనంతరం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

మియాపూర్ భూముల వేలం నిర్ణయం దివాలాకోరుతనం

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన మియాపూర్ 550 ఎకరాల భూములపై సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే, కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆగకుండా, ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వంలా మారిపోయి ఆ భూములను ఇష్టానుసారంగా వేలం వేసి అమ్మేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారంటేనే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమై, చీకట్లో తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన రక్తచరిత్ర కాంగ్రెస్‌దని విరుచుకుపడ్డారు. ఆరు దశాబ్దాల పాలనలో బీసీ కమిషన్ నివేదికలను అటకెక్కించి బీసీల గొంతు నొక్కిన కాంగ్రెస్.. నేడు బీసీ గణన పేరిట మొసలి కన్నీరు కారుస్తోందని ఫైరయ్యారు.

Also Read: రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

Tags

Related News

సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

ఫాక్స్ సాగర్ చెరువు గురించి మీకు తెలియని 129 ఏళ్ల నిజాలు.. త్వరలోనే మినీ ట్యాంక్‌బండ్‌గా!

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

Big Stories

Advertisement
×