E-Paper
Advertisement

గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌తో..అదిరిపోయే పాపులర్ స్మార్ట్ టీవీలు

గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌తో..అదిరిపోయే పాపులర్ స్మార్ట్ టీవీలు
Advertisement

Best Android TVs in India: ఇప్పుడు స్మార్ట్ టీవీ అంటే కేవలం సినిమాలు, సీరియల్స్ చూసే బాక్స్ మాత్రమే కాదు.. మన మాట వినే ఒక ఇంటెలిజెంట్ డివైజ్. అందుకే మార్కెట్లో ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ (Built-in Google Assistant) ఉన్న ఆండ్రాయిడ్ టీవీలకు డిమాండ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. రిమోట్ బటన్స్ వెతుక్కునే పని లేకుండా.. కేవలం మన వాయిస్ కమాండ్‌తో నడిచే టాప్ రేటెడ్ బడ్జెట్ టీవీలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ జూన్లో ఏసర్ (Acer), VW, బ్లౌపంక్ట్ బ్రాండ్స్ నుంచి ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ మోడల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచం రోజురోజుకూ మారిపోతోంది. ప్రస్తుతం స్మార్ట్ టీవీ కొనే ప్రతి ఒక్కరూ వెతికే ఫీచర్ ‘వాయిస్ కంట్రోల్’. టీవీ రిమోట్‌లోని గూగుల్ అసిస్టెంట్ బటన్ నొక్కి లేదా డైరెక్ట్‌గా “Hey Google, ప్లే పుష్ప 2 ట్రైలర్” అని చెప్తే చాలు.. స్క్రీన్ పై వాలిపోతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఇస్తున్న టాప్ బ్రాండ్స్ , వాటి మోడల్స్ లిస్ట్..

Advertisement

1. Acer Advanced I Series(V Pro QLED):
మార్కెట్లో Acer Smart TVs చాలా వేగంగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా వీరి ‘Advanced I Series’,లేటెస్ట్ ‘V Pro QLED’ సిరీస్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్/గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది. 16GB భారీ స్టోరేజ్ ఇవ్వడం వల్ల యాప్స్ అస్సలు ల్యాగ్ అవ్వవు. దీనిలోని గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్‌ను చాలా వేగంగా క్యాచ్ చేస్తుంది.  30Wడాల్బీ ఆడియో స్పీకర్లతో హోమ్ థియేటర్ లాంటి వైబ్ వస్తుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే క్లారిటీ మైండ్ బ్లోయింగ్.

2.VW OptimaX & Pro Series:
మీరు రూ.10వేలలోపు లేదా చాలా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న టీవీ కోసం చూస్తుంటే.. VW Smart TV పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రస్తుతం అమెజాన్ సేల్స్ లో ఇది టాప్ సెల్లింగ్ మోడల్‌గా దూసుకుపోతోంది. కేవలం తక్కువ ధరలోనే వీరు ‘క్యూఎల్ఈడీ’ డిస్‌ప్లే అందిస్తున్నారు. ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ దీని సొంతం. బడ్జెట్ రేంజ్‌లోనే బెజెల్-లెస్ ప్రీమియం డిజైన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఇన్-బిల్ట్ యాప్స్, స్మార్ట్ వాయిస్ రిమోట్ రావడం దీని ప్లస్ పాయింట్.

Advertisement

3.Blaupunkt CyberSound G2 & Quantum Dot:
సౌండ్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి జర్మన్ బ్రాండ్ అయిన Blaupunkt Smart TVs ఎప్పుడూ ఫస్ట్ ఆప్షన్. బ్లౌపంక్ట్ క్వాంటం డాట్ సిరీస్ గూగుల్ టీవీలు 1.1 బిలియన్ కలర్స్‌తో అద్భుతమైన విజువల్స్ ఇస్తాయి. దీని రిమోట్ కంట్రోల్‌లో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఈ టీవీల్లో 50W నుంచి 60W వరకు డాల్బీ అట్మోస్,  ట్రూసరౌండ్ స్పీకర్లు ఉంటాయి. అంటే మీరు విడిగా సౌండ్‌బార్ కొనాల్సిన అవసరమే లేదు.

గూగుల్ అసిస్టెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి?
ఈజీ సెర్చ్: టైప్ చేసే ఓపిక లేనప్పుడు వాయిస్ కమాండ్‌తో పాటలు, సినిమాలు సెర్చ్ చేయవచ్చు.

స్మార్ట్ హోమ్ కంట్రోల్: మీ ఇంట్లో స్మార్ట్ బల్బులు లేదా స్మార్ట్ ఫ్యాన్స్ ఉంటే, టీవీ రిమోట్ ద్వారానే వాటిని ఆన్/ఆఫ్ చేయవచ్చు.

లైవ్ అప్‌డేట్స్: సినిమా చూస్తూనే.. వెదర్ రిపోర్ట్ లేదా క్రికెట్ స్కోర్ అడిగి తెలుసుకోవచ్చు.

టీవీ కొనడం అనేది కేవలం బ్రాండ్ పేరు చూసి కాదు, ఫీచర్లు , వాల్యూ ఫర్ మనీ చూసి డిసైడ్ అవుతున్నారు. మీకు సూపర్ డిస్‌ప్లే, ఎక్కువ స్టోరేజ్ కావాలంటే Acer,అదిరిపోయే బేస్, థియేటర్ సౌండ్ కావాలంటే.. Blaupunkt, అదే తక్కువ బడ్జెట్‌లో.. స్మార్ట్ ఫీచర్లు కావాలనుకుంటే.. VW మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్. మీ బడ్జెట్‌ను బట్టి సరైన స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోండి.

Related News

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

Big Stories

Advertisement
×