E-Paper
Advertisement

ఫోన్ ఓపెన్ చేయక్కర్లేదు.. చేతిపైనే అంతా, పెబుల్ తెచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్ స్పెషాలిటీ ఏమిటంటే?

ఫోన్ ఓపెన్ చేయక్కర్లేదు.. చేతిపైనే అంతా, పెబుల్ తెచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్ స్పెషాలిటీ ఏమిటంటే?
Advertisement

Pebble Qore View: ప్రముఖ వేరబుల్ బ్రాండ్ పెబుల్.. ఇండియన్ మార్కెట్‌లోకి సరికొత్త వెల్‌నెస్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. Pebble Qore View పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ బ్యాండ్.. ఆరోగ్య రక్షణతో పాటు స్మార్ట్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడేవారిని అమితంగా ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.3,999గా ఉంది. లైట్ గ్రే, డీప్ బ్లాక్, డీప్ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్న ఈ డివైజ్‌ను పెబుల్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

చేతిపైనే హెల్త్ అప్డేట్స్:

ఈ బ్యాండ్‌లో అందించిన ‘క్విక్ వ్యూ’ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా, మన రోజువారీ అడుగులు, హార్ట్ రేట్ వంటి ముఖ్యమైన ఫిట్‌నెస్ వివరాలను నేరుగా చేతి మణికట్టు పైనే చూసుకోవచ్చు. నిత్యం బిజీగా ఉండే వారికి ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తుంది.

Advertisement

Also Read: మార్కెట్లోకి కొత్త సూపర్ కార్ ఎడిషన్ ఫోన్.. ఈ లుక్ చూస్తే ఐఫోన్ కూడా దిగదుడుపే!

ఫ్యామిలీతో కలిసి ఫిట్‌నెస్ ఛాలెంజ్:

ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యాన్ని మరింత సరదాగా మార్చేందుకు ఇందులో ఒక చక్కటి ఫీచర్ ఉంది. మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రైవేట్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుని, ఎవరు ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారు, ఎలా నిద్రపోయారు వంటి వివరాలను ఒక లీడర్‌బోర్డ్ ద్వారా పోల్చి చూసుకోవచ్చు. ఈ చిన్నపాటి పోటీ మనలో ఫిట్‌నెస్ పట్ల మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.

రోజంతా నిరంతర నిఘా:

Advertisement

ఈ డివైజ్‌లో ఉన్న ‘నెక్స్ట్ జనరేషన్ వెల్‌నెస్ సూట్’ గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా మనం పడుకునే విధానాన్ని విశ్లేషించి, నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన చిట్కాలను అందిస్తుంది. అలాగే, దీని మెటల్ యూనిబాడీ డిజైన్, క్వాడ్ నిట్ ఫ్యాబ్రిక్ స్ట్రాప్ ధరించడానికి చాలా మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటూనే దుమ్ము, చెమట నుండి రక్షణ ఇస్తాయి.

సబ్‌స్క్రిప్షన్ లేని ఏఐ ఫీచర్లు:

ఈ బ్యాండ్ బ్యాటరీ లైఫ్ అద్భుతమనే చెప్పాలి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 30 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీంతో పాటు లభించే ‘పెబుల్ హాలో’ మొబైల్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మన ఆరోగ్య స్థితిని విశ్లేషించి ఒక హెల్త్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ ప్రీమియం ఫీచర్లు, హెల్త్ ఇన్‌సైట్స్ అన్నింటినీ ఎలాంటి నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఫీజులు లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Also Read: Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!

Related News

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

అల్టిమేట్ ఫీచర్లతో..టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్, మీరూ ఓ లుక్కేయండి

కొత్త వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్..ఇంత వరకూ లేని ఫీచర్లతో హల్ చల్!

లుక్స్,బ్యాటరీ చూసి ఇయర్‌బడ్స్ కొంటే మోసపోతారు!ఈ ఒక్కటి చెక్ చేస్తే చాలు

కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!

నవంబర్‌లో కొత్త ఫోన్ల జాతర.. వివో, షావోమీ, వన్‌ప్లస్ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే మోడల్స్ ఇవే!

రూ.15 వేలకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. అమెజాన్‌లో 4 రియల్‌మీ ఫోన్లపై మతిపోయే ఆఫర్లు!

ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!

Big Stories

Advertisement
×