E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో స్వచ్ఛమైన తాగునీరు! మిస్ కాకూడని టాప్ 5 ప్యూరిఫైయర్లు

తక్కువ బడ్జెట్‌లో స్వచ్ఛమైన తాగునీరు! మిస్ కాకూడని టాప్ 5 ప్యూరిఫైయర్లు
Advertisement

Best RO Water Purifier Under 10000: మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే ఆధారపడి ఉంటుంది. నేటి రోజుల్లో.. మంచి నీటి కోసం కేవలం ఆర్ఓ ప్యూరిఫికేషన్ ఉంటే సరిపోదు, అందులో శరీరానికి అవసరమైన మినరల్స్ కూడా ఉండాలి. ప్యూర్ ఆర్ఓ వల్ల నీటిలోని అవసరమైన ఖనిజాలు కూడా పోతాయి. అందుకే మినరల్ ఎన్‌హ్యాన్సర్ ఉన్న ప్యూరిఫైయర్లు వాడటం చాలా ముఖ్యం. రూ.10వేల బడ్జెట్‌లో డైలీ వాడుకోవడానికి సరిపోయే 5 బెస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ల లిస్ట్, వాటి ధరలు ఇప్పుడు చూద్దాం.

తక్కువ బడ్జెట్‌లో స్వచ్ఛమైన, ఖనిజాలతో కూడిన తాగునీటిని అందించే ప్రముఖ బ్రాండ్ల ప్యూరిఫైయర్ల వివరాలు..

Advertisement

1. Kent Ultra Storage UV+UF Water Purifier:

వాటర్ ప్యూరిఫైయర్ల రంగంలో బ్రాండ్‌కు చాలా మంచి నమ్మకం ఉంది. ఈ మోడల్‌లో ఉన్న ప్రత్యేకమైన ‘Mineral ROTM’ టెక్నాలజీ నీటిని శుద్ధి చేసే క్రమంలో అందులో ఉండే సహజమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కోల్పోకుండా కాపాడటంలో ఎంతో సహాయ పడుతుంది. ఇందులో ఉన్న 7 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ ప్రతి రోజూ ఇంటి అవసరాలకు సరిగ్గా సరి పోతుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించి, నీటిని ఎంతో స్వచ్ఛంగా మార్చుతుంది.

Advertisement

ధర: రూ.8,499 నుంచి రూ. 9,200 వరకు ఉంటుంది.

2.Aquaguard Sure Delight NXT RO+UV+UF+Taste Adjuster:

ఆక్వాగార్డ్ అందించే ఈ ప్యూరిఫైయర్ ప్రతి రోజూ ఇంట్లో వాడటానికి చాలా అనుకూలమైంది. ఇందులోని ఫీచర్ నీటిలోని ఉప్పుదనాన్ని తగ్గించి తీపిగా మారుస్తుంది. దాదాపు 6 రకాల ప్యూరిఫికేషన్ స్టేజీలతో.. పాటు, నీటిలోని సహజ సిద్ధమైన మినరల్స్ పోకుండా కాపాడే టెక్నాలజీ దీని సొంతం. 6 లీటర్ల కెపాసిటీ కలిగి ఉండి, కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేలా ఎనర్జీ సేవింగ్ మోడ్‌తో పని చేస్తుంది.

ధర: రూ.8,999 నుంచి రూ. 9,500 వరకు ఉంటుంది.

3.V-Guard Rewa RO+UV+UF+Mineralizer Water Purifier:

వి-గార్డ్ కంపెనీ చాలా బెస్ట్ మోడల్స్ కలిగి ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా.. బోర్ నీటిలో ఎక్కువ టీడీఎస్ ఉన్న చోట కూడా చాలా ఈజీగా నీటిని శుద్ధి చేయడానికి డిజైన్ చేయబడింది. ఇందులో.. 7 లీటర్ల స్టోరేజ్ , 8-స్టేజ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ‘Mineralizer’ ఫిల్టర్ నీటిలో పిహెచ్ స్థాయిని సరైన పరిమాణంలో సమతుల్యంగా ఉంచి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

ధర: రూ.7,999 నుంచి 8,499 వరకు ఉంటుంది.

4.Livpure Glo PRO+ RO+UV+UF+Taste Enhancer:

లివ్‌ప్యూర్ బ్రాండ్ అందించే ఈ ‘గ్లో ప్రో ప్లస్’ మోడల్ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లలో ఒకటి. 7 లీటర్ల కెపాసిటీతో ఉండే ఈ ప్యూరిఫైయర్ రోజుకు దాదాపు 12 నుంచి 15 లీటర్ల నీటిని చాలా వేగంగా శుద్ధి చేస్తుంది. ఇందులో ఉన్న మినరల్ ఫిల్టర్ నీటిని రుచిగా మార్చడమే కాకుండా శరీరానికి కావాలసిన మినరల్స్ అందిస్తుంది. దీనికి ఉన్న ఎల్‌ఈడీ ఇండెక్స్ ద్వారా ట్యాంక్ ఫుల్ అయిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.

ధర: రూ.7,499 నుంచి రూ.7,999 వరకు ఉంటుంది.

5. Faber Neutron Water Purifier:

ఫాబర్ బ్రాండ్ ప్యూరిఫైయర్లు ప్రస్తుతం మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది నీటిని ఆల్కలైన్‌గా మార్చడమే కాకుండా.. ఉప్పు నీటిని కూడా చాలా స్వచ్ఛంగా ప్యూరిఫై చేస్తుంది. ఇందులో.. 10 లీటర్ల పెద్ద స్టోరేజ్ ట్యాంక్ ఉంది. కాబట్టి తరచూ పవర్ కట్ అయ్యే ప్రాంతాలకు ఇది చాలా ఉపయోగ పడుతుంది. దీనిలోని లేటెస్ట్ టెక్నాలజీల వల్ల నీటిలోని హానికారక రసాయనాలు తొలగిపోయి, శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

ధర: రూ.8,299 నుంచి రూ. 8,999 వరకు ఉంటుంది.

ఫిల్టర్ కొనేముందు ఇవి గమనించండి:

టీడీఎస్ చెకింగ్: మీ ఇంటి నీటి టీడీఎస్ స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ తప్పని సరిగా ఎంచుకోవాలి.

ఫిల్టర్ మెయింటెనెన్స్: ఏడాదికి ఒక సారి ఫిల్టర్లు మార్చడం ద్వారా.. ప్యూరిఫైయర్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

Related News

8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!

షాపింగ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీలు ఫిక్స్.. ఆఫర్ల పూర్తి లిస్ట్ ఇదిగో!

ఫ్రిడ్జ్ డోర్‌పై అయస్కాంతాలు.. కరెంట్ బిల్లుపై పడే ప్రభావం ఎంత? నిజానిజాలివే!

మీ ఇంటికి పర్ఫెక్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? LG టాప్ 5 మోడల్స్ ఇవే!

స్మార్ట్ ఫీచర్స్,ఎక్కువ స్పేస్! మీ ఇంటికి తగ్గ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

Big Stories

Advertisement
×