E-Paper
Advertisement

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!
Advertisement

T-Fiber Project: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో డిజిటల్‌ సేవలను గ్రామగ్రామానికీ, ఇంటింటికీ చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్‌ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంటోంది. తక్కువ ధరకే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విస్తరణకు చర్యలు వేగవంతమవుతున్నాయి. ప్రతి ఇంటికీ కేవలం రూ.300కే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తొలి విడతలో మూడు లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం అనుమతి లభించింది. భారత్‌నెట్‌ పథకం కింద తెలంగాణకు రూ.3,189 కోట్లు మంజూరు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమైంది.

ప్రతి ఇంటికీ 300లకే..

Advertisement

ఇప్పటివరకు పట్టణాలకే ఎక్కువగా పరిమితమైన నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలను పల్లెల్లోని సామాన్య కుటుంబాలకూ అందించాలన్నది టీ-ఫైబర్‌ ప్రధాన ఉద్దేశం. నెలకు రూ.300కే కనెక్షన్‌ అందుబాటులోకి వస్తే విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు, పోటీ పరీక్షల సన్నద్ధత, డిజిటల్‌ పాఠ్యాంశాలను సులభంగా వినియోగించుకోవచ్చు. రైతులు వ్యవసాయ సమాచారం, వాతావరణ వివరాలు, మార్కెట్‌ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలు కూడా ప్రజలకు చేరువ చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా పలు సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు అవసరమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ఇది బలోపేతం చేస్తున్నారు. ప్రతి ఇంటికి కేబుల్ వేయాలంటే సుమారు 9 నుంచి 10వేలు అవుతుందని, అయితే టీఫైబర్ తో ఎలాంటి ఖర్చులేకుండా కేవలం 300లతో కనెక్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నారు.

భారత్‌నెట్‌ నిధులతో విస్తరణ

Advertisement

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్‌నెట్‌ పథకం టీ-ఫైబర్‌కు కీలక ఆధారంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో నాలుగు గ్రామాలు మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం అడవి శ్రీకారంపూర్, రంగారెడ్డి జిల్లా హాజీ పల్లి, నాగర్ కర్నూల్ జిల్లా మగ్దూర్, సంగారెడ్డి జిల్లా సంగుపేట ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సక్సెస్ రేట్ ను చూపారు. టీపైబర్ తో నూరుశాతం ఫలితాలు రావడం, అడవీ శ్రీకారంపూర్ జడ్పీహెచ్ఎస్ లో 48 మంది విద్యార్థుల నుంచి ఏకంగా 168మందికి చేరారని అధికారులు తెలిపారు. కేంద్రమంత్రి సింధియా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్వాలియర్ నియోజకవర్గం గుణజిల్లా, ఉమ్రిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సక్సెస్ ను చూపడంతో కేంద్రం రాష్ట్రానికి ప్రోత్సాహాకాలపై హామీ ఇచ్చింది. భారత్ నెట్ పథకం కింద తెలంగాణకు ఈ నెల 6న రూ.3,189 కోట్లు శాంక్షన్ ఇచ్చింది. త్వరలోనే పనులకు టెండర్ ఇచ్చి 6 నెలల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల వరకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించి, అక్కడి నుంచి ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు అనుసంధానాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

3 లక్షల కనెక్షన్లకు కేంద్రం అనుమతి

రాష్ట్రంలో ఇప్పటికే 8,966 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ కల్పించారు. క్షేత్రస్థాయిలో ఈ సేవలను అందించేందుకు 9 వేల మంది ఎల్‌ఓసీలను నియమించారు. అయితే తొలి దశలో 3 లక్షల కనెక్షన్లకు కేంద్రం అనుమతి లభించడంతో అమలు ప్రక్రియకు ప్రాధాన్యం పెరిగింది. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్ టీ ఫైబర్ పనులు పెండింగ్ లో ఉండగా ఆ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ జిల్లాల్లో మిగిలిన 3803 గ్రామాల్లో పైబర్ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. కేంద్రం మంజూరు చేసిన నిధులతో 10 ఏళ్లపాటు మెయింటెన్స్, కేబుల్ పనులు చేపట్టనున్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్ల మాదిరిగా పైబర్, రౌటర్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో

ప్రస్తుతం 19,435 కార్యాలయాలకు నెట్

ప్రజలకు ఇంటర్నెట్‌ అందించడంతోపాటు ప్రభుత్వ పరిపాలనలోనూ డిజిటల్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 41,275 ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించాల్సి ఉండగా, ఇప్పటివరకు 19,435 కార్యాలయాలకు అనుసంధానం కల్పించారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలకు వేయబోతున్నారు. ప్రైవేట్ ఆపరేట్లకు ప్రతి నెల 85.78కోట్లు చెల్లించేవారు. టీ పైబర్ తో 52.57కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి 33.06కోట్లు మిగిలినట్లు అధికారికంగానే లెక్కలు చెబుతున్నాయి. ఒక సచివాలయానికే ప్రైవేట్ ఆపరేట్లకు 17కోట్ల చెల్లించడం జరిగిందని, ప్రస్తుతం టీ పైబర్ కు 77లక్షలు మాత్రమే చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ ఫైబర్ నెట్ తో 100కోట్లు ప్రతి నెల టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

అంతరాయాలు లేని సేవలకు కోర్‌ నెట్‌వర్క్‌

ఫైబర్‌ కనెక్షన్లు ఇచ్చినంత మాత్రాన సేవలు నిరంతరాయంగా అందుతాయన్న హామీ ఉండదు. నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు, ఫైబర్‌ కేబుళ్లకు నష్టం, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, నిర్వహణ లోపాలు వంటి కారణాలతో సేవలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిని అధిగమించేందుకు టీ-ఫైబర్‌లో కోర్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతను వినియోగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే డేటా ట్రాఫిక్‌ను సమన్వయం చేయడం, నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని నిర్వహించడం, సమస్యలను గుర్తించడం వంటి కీలక కార్యకలాపాలకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి తోడు కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ ఉంటే ఎక్కడైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోర్ నెట్ వర్క్ తో 3 రూట్ల నుంచి నెట్ సేవలు పొందవచ్చని, ఒక వైపు నుంచి రాకుంటే మరోవైపు నుంచి నెట్ వచ్చేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

నానక్‌రామ్‌గూడలో నాక్‌ కేంద్రం

నెట్‌వర్క్‌ నిర్వహణ, పర్యవేక్షణ కోసం హైదరాబాద్‌లోనిఅవుటర్ రింగ్ రోడ్డులో నానక్‌రామ్‌గూడలో దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌ కేంద్రం (ఎన్‌ఓసీ/నాక్‌ సెంటర్‌) ఏర్పాటు చేయడం ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఫైబర్‌ నెట్‌వర్క్‌ పనితీరును ఒకే చోటు నుంచి పర్యవేక్షించేందుకు ఇది దోహదపడుతుంది.నెట్‌వర్క్‌ అందుబాటు, డేటా ట్రాఫిక్‌, కనెక్షన్ల పనితీరు, సాంకేతిక సమస్యలు తదితర అంశాలను నిరంతరం పరిశీలించడం ద్వారా సమస్యల పరిష్కార సమయాన్ని తగ్గించవచ్చు. ఎక్కడైనా కనెక్షన్‌ నిలిచిపోయినా, వేగం తగ్గినా సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ప్రాధాన్యం..

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఎఫ్‌ఆర్టీ బృందాలు ఫైబర్‌ నెట్‌వర్క్‌ నిర్వహణలో క్షేత్రస్థాయి పర్యవేక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. సేవల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించి సరిచేసేందుకు ఎఫ్‌ఆర్టీ (ఫీల్డ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌) బృందాలను వినియోగిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేపట్టడం, కనెక్షన్ల పనితీరును పరిశీలించడం వీటి బాధ్యత ప్రతి రోజూ ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిష్కారం అయిన వాటి వివరాలను ఆన్ లైన్ లోనే పొందుపరుస్తున్నారు. దీనికి అదనంగా 240 మంది ఫీల్డ్‌ ఆడిటింగ్‌ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా నెట్‌వర్క్‌ నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు.

సైబర్‌ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు

ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల ముప్పు కూడా పెరుగుతోంది. వ్యక్తిగత సమాచారం చోరీ, అనధికారిక ప్రవేశాలు, మాల్‌వేర్‌ దాడులు, ఫిషింగ్‌ వంటి సమస్యల నుంచి వినియోగదారులను రక్షించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యేక భద్రతా సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

డిజిటల్‌ తెలంగాణకు కీలక అడుగు

టీ-ఫైబర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్‌ అంతరాన్ని తగ్గించే అవకాశం ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రభుత్వ పాలన, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఇంటర్నెట్‌ వినియోగం పెరగనుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తక్కువ ధరలో నాణ్యమైన ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం ప్రయోజనకరం.

దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్

దేశంలోనే ఏరాష్ట్రానికి ఇంత పెద్ద నెట్ వర్క్(టీ-ఫైబర్) లేదు. రాష్ట్రంలో 4పైలట్ ప్రాజెక్టులను ఎంపిక చేసి సక్సెస్ ను కేంద్రానికి చూపాం. దీంతో కేంద్రం రాష్ట్రానికి భారత్ నెట్ పథకం కింద 3189కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మిగిలిన ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. పనులు ప్రారంభిస్తాం. ప్రతి ఒక్కరికి 300లతో నాణ్యమైన పైబర్ నెట్ సేవలు అందించాలన్నదే లక్ష్యం. గ్రామాల్లో ఎల్సీఓలను9 వేల మందిని నియమించాం. వారితో అవగాహన కల్పిస్తున్నాం. కోర్ నెట్ వర్క్ తో ఇబ్బందులు సేవలు. ప్రిన్సిపుల్ మ్యానిటైజేషన్ పాలసీ(పీఎంపీ) ద్వారా సేవలందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ఇన్వెస్టిమెంట్ ఇస్తే వారికి కాంట్రాక్టు అప్పగిస్తాం. ప్రస్తుతం నెలకు 52.72 కోట్ల ఆదాయం వస్తుంది..మా టార్గెట్ ప్రతి నెల 100కోట్లు ఆదాయం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో టీపైబర్ ను ముందుకు తీసుకెళ్తున్నాం.

 Also Read: తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

Tags

Related News

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!

Big Stories

Advertisement
×