Best robot vacuum: ఉరుకుల పరుగుల జీవితంలో.. ఇల్లు శుభ్రం చేయడం అనేది రోజూ ఒక పెద్ద పనిలా మారిపోయింది. ఆఫీస్ పనులు,ఇంటి బాధ్యతల మధ్య రోజూ ఊడ్చి, తుడవడానికి చాలా సమయం వృధా అవుతుంది. ఈ టెన్షన్ అంతా పోగొట్టి, మీ పనిని ఈజీగా చేయడానికి మార్కెట్లోకి అడ్వాన్స్‌డ్ రోబో వాక్యూమ్ అండ్ మాప్స్ వచ్చేశాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు, మీ ఇల్లు మొత్తం మెరిసి పోతుంది. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ రోబో వాక్యూమ్ క్లీనర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షియోమి బ్రాండ్ నుంచి వస్తున్న ఈ రోబో వాక్యూమ్ లేజర్ డిస్టెన్స్ సెన్సార్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది మీ ఇల్లు మొత్తాన్ని.. మ్యాప్ చేసుకుని ఎక్కడెక్కడ మురికి ఉందో గుర్తిస్తుంది. వాక్యూమింగ్, మాపింగ్ రెండూ అద్భుతంగా చేసే ఈ డివైజ్ ధర సుమారు రూ.18,999 వరకు ఉంది. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా దీన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయెచ్చు.
ప్రముఖ బ్రాండ్ అయిన.. యూరేకా ఫోర్బ్స్ నుంచి వచ్చిన ఈ రోబోటిక్ క్లీనర్ ఇండియన్ హోమ్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది బలమైన సక్షన్ పవర్‌తో.. దుమ్మును పూర్తిగా తొలగిస్తుంది. అలాగే హార్డ్ ఫ్లోర్స్ , కార్పెట్లపై చాలా చక్కగా.. పని చేస్తుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర సుమారు Rs. 16,499 వద్ద లభిస్తోంది.
అడ్వాన్స్‌డ్ నేవిగేషన్ , ఆటో-ఎంప్టీ కెపాసిటీతో వచ్చే ఈ ఈకో వాక్స్ డిబోట్ మోడల్ ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఇది ఒకే సారి వాక్యూమ్ చేయడంతో.. పాటు ఫ్లోర్‌ను నీటితో నీట్‌గా మాప్ చేస్తుంది. దీని ధర సుమారు రూ. 29,999వరకు ఉంటుంది. టెక్ లవర్స్ ఇది ఒక అద్భుతమైన గాడ్జెట్.
మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి రోబో వాక్యూమ్ కోరుకుంటే.. ఐలైఫ్ వీ5ఎస్ ప్రో ఒక మంచి ఆప్షన్. స్లిమ్ డిజైన్‌తో వచ్చే ఇది మంచాలు, సోఫాల కింద ఉన్న దుమ్మును కూడా ఈజీగా శుభ్రం చేస్తుంది. దీని ధర సుమారు రూ.14,999 గా ఉంది.ఇది రోజువారీ క్లీనింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
స్మార్ట్ హోమ్ గాడ్జెట్ల లిస్ట్‌లో రియల్‌మి కూడా అద్భుత మైన ఫీచర్లతో.. రోబో వాక్యూమ్‌ను అందిస్తోంది. వాయిస్ కంట్రోల్ (అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్) సపోర్ట్ ఉన్న ఈ డివైజ్ వైఫై కనెక్టివిటీతో పని చేస్తుంది. దీని ధర సుమారు రూ. 19,499 వరకు లభిస్తోంది.
Also Read: కరెంట్ పోయినా కూలింగ్ పోదు..ఇన్వర్టర్ కనెక్టివిటీతో 5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు!
మ్యాపింగ్ సెటప్: మొదటి సారి వాడే టప్పుడు ఇంటి ప్లాన్‌ను రోబో మెమరీలో సేవ్ అయ్యేలా చూసుకోండి.
రెగ్యులర్ మెయింటెనెన్స్: డస్ట్ బిన్‌ను రోజూ క్లీన్ చేయడం వల్ల.. వాక్యూమ్ సక్షన్ పవర్ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది.
అడ్డంకులు తొలగించండి: క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు నేలపై.. ఉన్న చిన్న బొమ్మలు, వైర్లను పక్కన పెట్టడం మంచిది.
సమయాన్ని ఆదా చేసుకుంటూ మీ ఇల్లు ఎప్పుడూ నీట్‌గా, హైజెనిక్‌గా ఉంచుకోవడానికి ఈ రోబో వాక్యూమ్ క్లీనర్లను ఇప్పుడే కొనేయండి.