Best Smart TVs Under 10k: ఇంట్లో ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి? కానీ ఎక్కువ ధర పెట్టి కొనాలంటే.. చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు ఆ టెన్షన్ అసలు అవసరమే లేదు! ఎందుకంటే ప్రముఖ బ్రాండ్ల నుంచి రూ.10,000 లోపు బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లు, హెచ్‌డీ డిస్‌ప్లే , స్మార్ట్ ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో కూడిన టీవీలు మార్కెట్లో లభిస్తున్నాయి. తక్కువ ధరలో.. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే.. టాప్ 5 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్‌తో చాలా ట్రెండీగా ఉంటుంది. దీనికి 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే, పవర్ ఫుల్ ఇన్‌బిల్ట్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్ దీని ప్రత్యేకత. వైఫై కనెక్టివిటీతో యూట్యూబ్, ప్రైమ్ వీడియోలను ఈజీగా చూడొచ్చు. దీని ధర సుమారు రూ.7,499-రూ.8,500 మధ్య ఉంటుంది.
ఏసర్ బ్రాండ్ అంటేనే క్వాలిటీకి మారుపేరు. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ప్లాట్ ఫారమ్‌పై పని చేస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్, అద్భుతమైన పిక్చర్ క్లారిటీ, క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్ వంటి ఫీచర్లు ఈ బడ్జెట్‌లో లభించడం విశేషం.దీని ధర సుమారు రూ.8,999-రూ.9,999 మధ్య ఉంటుంది.
అత్యంత తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ ఫీల్ కోరుకునే వారికి ఫాక్స్‌స్కై బెస్ట్ ఛాయిస్. హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే,మల్టిపుల్ హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్‌లు, స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లతో ఇది వస్తుంది. చిన్న హాల్స్ లేదా బెడ్‌రూమ్‌లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర సుమారు రూ.6,999-రూ.7,999 మధ్య ఉంది.
Also Read: మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!
కొడాక్ బ్రాండ్ టీవీలు మార్కెట్లో మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. ఈ మోడల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై .. రన్ అవుతుంది. అద్భుతమైన కలర్ కాంట్రాస్ట్, పవర్ సేవింగ్ టెక్నాలజీ, యూజర్‌ఫ్రెండ్లీ రిమోట్ దీని సొంతం. అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇందులో సపోర్ట్ చేస్తాయి. దీని ధర సుమారు రూ.8,499-రూ.9,499 మధ్య లభిస్తుంది.
జర్మన్ టెక్నాలజీతో.. తయారైన ఈ టీవీలు సౌండ్ క్వాలిటీకి చాలా పేరుగాంచాయి. ఈ 32 ఇంచుల స్మార్ట్ టీవీలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, రిచ్ ఆడియో స్పీకర్లు, బెజెల్-లెస్ డిజైన్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ 8,999-రూ.9,999 మధ్య ఉంటుంది.
రూ.10వేలలోపు బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీని కొనాలనుకునే వారికి పై మోడల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మీ ఇల్లు లేదా రూమ్‌కు సరిపోయే బ్రాండ్‌ను ఎంచుకుని మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి.