E-Paper
Advertisement

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!
Advertisement

charging cable maintenance tips: స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో.. ఎంత ముఖ్యమైన భాగమైపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మరి ఫోన్ సరిగ్గా పని చేయాలంటే ఛార్జింగ్ ఉండాలి కదా! కానీ చాలా మందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది.అదేంటంటే..మనం కొన్న కొద్ది రోజులకే ఛార్జింగ్ కేబుల్స్ మధ్యలో .. విరిగిపోవడం లేదా వైర్లు బయటకు రావడం జరుగుతుంటుంది. ప్రతీ సారీ కొత్త కేబుల్స్ కొనలేక విసిగిపోతుంటారు. మీ ఛార్జింగ్ కేబుల్స్ చాలా సంవత్సరాల పాటు పాడవకుండా ఉండటానికి, త్వరగా పాడవకుండా ఉండటానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం!

1. కేబుల్‌ను బలంగా లాగడం :

చాలా మంది ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కేబుల్ వైర్‌ను పట్టుకుని లాగుతుంటారు. లేదా సాకెట్ నుంచి ప్లగ్ తీసే టప్పుడు వైర్‌ను గట్టిగా లాగుతారు. ఇలా చేయడం వల్ల కేబుల్ లోపలి.. కాపర్ వైర్లు విరిగి పోతాయి. ఎప్పుడైనా సరే వైర్‌కు బదులుగా ప్లగ్ హెడ్ లేదా కనెక్టర్ ప్లాస్టిక్ భాగాన్ని పట్టుకుని నిదానంగా తొలగించాలి.

2. కేబుల్‌ను గట్టిగా చుట్టడం :

Advertisement

మనం బయటకు వెళ్లే టప్పుడు కేబుల్స్‌ను ఇష్టా నుసారంగా.. జేబులో లేదా బ్యాగులో కురుక్కు పోతుంటాయి. అలాగే కొన్ని సార్లు కేబుల్‌ను చాలా గట్టిగా చుట్టి ముడి వేస్తుంటారు. దీని వల్ల వైర్ లోపలి భాగాలు బెండై కరెంట్ సప్లై ఆగిపోతుంది. కేబుల్‌ను ఎప్పుడూ లూజ్‌గా, గుండ్రని సర్కిల్ రూపంలో చుట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

3. స్ప్రింగ్స్ లేదా పెన్ క్యాప్ ట్రిక్:

ఛార్జింగ్ కేబుల్స్ ఎక్కువగా ఏ భాగంలో విరిగి పోతాయి? అడాప్టర్ వైపు , ఫోన్ కనెక్ట్  చేసే టైప్-సి / లైటనింగ్ పోర్ట్ దగ్గర ఉన్న వైర్ భాగం త్వరగా బెండై పాడవుతుంది. దీన్ని నివారించడానికి.. పాత పెన్‌లలో ఉండే స్ప్రింగ్స్‌ను తీసి ఆ వైర్ ముట్లకు చుట్టొచ్చు. లేదా మార్కెట్లో దొరికే సిలికాన్ కేబుల్ సేవర్స్ వాడటం ద్వారా వైర్ బెండ్ కాకుండా కాపాడుకోవచ్చు.

Advertisement

Also Read: పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

4. వేడి ప్రదేశాలలో ఛార్జింగ్ :

మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టే టప్పుడు దుప్పట్లు, దిండ్ల మీద లేదా ఎండ తగిలే ప్రదేశాలలో ఉంచడం వల్ల ఫోన్‌ తో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా ఎక్కువగా వేడెక్కుతుంది. దీని వేడి వల్ల కేబుల్ పై ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ కరిగి పోయి లోపలి వైర్లు బయటికి వచ్చే స్తాయి. ఎప్పుడూ చల్లని , గాలి వచ్చే ప్రదేశాలలో ఉంచి ఛార్జింగ్ చేయడం మంచిది.

5. లోకల్ చీప్ కేబుల్స్:

కొన్నిసార్లు.. తక్కువ ధరకు వస్తున్నాయని రోడ్డు మీద అమ్మే లోకల్ కేబుల్స్‌ను కొంటుంటారు. అవి త్వరగా.. వేడెక్కి ఫోన్ బ్యాటరీని కూడా దెబ్బ తీస్తాయి. ఎల్లప్పుడూ ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కేబుల్స్‌ను మాత్రమే ఉపయోగించడం వల్ల ఫోన్ సేఫ్టీతో పాటు కేబుల్ లైఫ్ కూడా చాలా వరకు పెరుగుతుంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

Related News

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Big Stories

Advertisement
×