BigTV English

OTT Movie : రాత్రిపూట మాత్రమే కనిపించే అమ్మాయి… ప్రియుడితో ఆ పని చేయాలనుకుంటే?

OTT Movie : రాత్రిపూట మాత్రమే కనిపించే అమ్మాయి… ప్రియుడితో ఆ పని చేయాలనుకుంటే?

OTT Movie : ప్రేమ అనే పదం లేకుండా మనిషి జీవితం లేదు, సినిమాలు కూడా లేవు. ఈ పదం ఎంత గొప్పదో అనుభవించే వాళ్ళకి బాగా తెలుసు. ప్రేమ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. అయితే కొన్ని లవ్ స్టోరీస్ నిజజీవితంలో అయినా, సినిమాలలో అయినా మనసుని బాగా హత్తుకుంటాయి. మనసుకు హత్తుకునే ఒక మంచి కథతో వచ్చిన ఫీల్ గుడ్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘మిడ్‌నైట్ సన్‘ (Midnight Sun). 2018 లో వచ్చిన ఈ మూవీకి స్కాట్ స్పియర్ దర్శకత్వం వహించారు. బెల్లా థోర్న్, పాట్రిక్ స్క్వార్జెనెగర్, రాబ్ రిగ్లే నటించారు. ఇందులో జిరోడెర్మా పిగ్మెంటోసమ్‌ (xp) తో బాధపడుతున్న ఒక అమ్మాయికి సూర్యకాంతిలోకి వెళ్లకుండా నిరోధించే ఒక వైద్య పరిస్థితి ఉంటుంది. సూర్యుడి వెలుతురు పడితే చనిపోయే ఈ అమ్మాయి, ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఈ లవ్ స్టోరీ తో మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కేట్ కి చిన్నప్పటినుంచి xp అనే జబ్బు ఉంటుంది. సూర్యుడి వెలుతురు తన మీద పడితే కేట్ చనిపోతుంది. అప్పటినుంచి తండ్రి కేట్ ని స్కూల్ కి పంపించకుండా ఇంటిలోనే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సూర్యుడు వెలుతురు ఇంట్లో పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాడు. కేట్ స్కూల్ కి ఎందుకు రావట్లేదో తెలుసుకున్న మోర్గాన్ అనే ఫ్రెండ్, రాత్రిపూట ఆమెతో ఆడుకుంటూ ఉంటుంది. కేట్ తన ఇంటి పక్కనే ఉండే చార్లీ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది. చిన్నప్పటినుంచి అతనిని దూరంగా చూస్తూనే ప్రేమిస్తూ ఉంటుంది. ఈమె పెరిగి టీనేజ్ వయసుకు వస్తుంది. ఒకరోజు రాత్రిపూట తండ్రికి చెప్పి సరదాగా బయటికి వెళుతుంది. ఆ సమయంలో చార్లీ తనని మొదటిసారిగా చూస్తాడు. ఆమె గిటార్ వాయించుకుంటూ ఉండగా అక్కడే నిలబడి చూస్తాడు. ఆమెతో మాట్లాడాలని ట్రై చేయగా అక్కడినుంచి కేట్ హడావిడిగా వెళ్లిపోతుంది. ఎందుకంటే చార్లీ ని అలా దగ్గరనుంచి చూసేసరికి ఆమె టెన్షన్ పడుతుంది. ఈ హడావిడిలో తన డైరీ మర్చిపోతుంది. చార్లీ ఆ డైరీ ని తీసుకొని మరుసటి రోజు కేట్కి ఇస్తాడు. అందులో తన ఫోన్ నెంబర్ కూడా రాస్తాడు. అప్పట్నుంచి వీళ్ళిద్దరూ రాత్రిపూట బయట తిరుగుతూ సరదాగా గడుపుతారు. ఈ విషయం తన తండ్రితో కూడా చెప్తుంది కేట్. అయితే పగలు బిజీగా ఉంటానని చార్లీతో చెప్తుంది. అలా ఒక రోజు బయట తిరిగి ఇంటికి వచ్చేసరికి, సూర్యుని కిరణాలు ఆమె మీద పడతాయి. అలా ఆమె హాస్పిటల్లో జాయిన్ అవుతుంది.

అప్పటికే ఆమెకు క్యాన్సర్ సోకినట్లు డాక్టర్లు చెబుతారు. తొందరలోనే కేట్ చనిపోతుందని తెలుసుకున్న తండ్రి చాలా బాధపడతాడు. ఈ విషయం చార్లీకి కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు మోటివేషన్ ఇచ్చుకుంటారు. ప్రపంచంలో భయంకరమైన విషయం ఏమంటే.. ఒక వ్యక్తి చనిపోయే రోజు ముందే తెలియడం. తన తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో, తండ్రి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తండ్రికి ఆన్లైన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది కేట్. తనకి ఒక తోడు అవసరమని తెలుసుకుంటుంది. ఆ తర్వాత చార్లీతో ఒకరోజు సన్ రైజ్ లో గడపాలనుకుంటుంది. అలా గడిపిన తర్వాత ఒకరోజు చనిపోతుంది. అయితే చనిపోయే ముందు డైరీలో ఒక మాట రాసి చనిపోతుంది. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం చార్లీ. దూరం నుంచి చూస్తూనే నిన్ను ఇష్టపడ్డాను. మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. అయితే నేను నీకు గుర్తు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూస్తే నేను నీకు కనపడతాను. ఐ లవ్ యు చార్లీ అని రాసి ఉంటుంది. అప్పుడప్పుడు ఇటువంటి ఫీల్ గుడ్ మూవీస్ చూస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా కాస్త సమయాన్ని కేటాయించి ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×