Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్, తెలంగాణ డిఎస్పి మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే… టీమిండియాలో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు మహమ్మద్ సిరాజ్. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిఎస్పి పోస్టు కూడా అందుకున్నాడు. అయితే అలాంటి మహమ్మద్ సిరాజ్ గురించి ఇవాళ ఉదయం నుంచి కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ సింగర్ జనై భోస్లే ( Zanai Bhosle ) తో… మహమ్మద్ సిరాజ్ డేటింగ్ చేసినట్లు… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ సింగర్ తో మహమ్మద్ సిరాజ్ పార్టీకి కూడా వెళ్లినట్లు… చెబుతున్నారు. ఆశా భోస్లే మనవరాలు… ప్రముఖ సింగర్ జనై భోస్లే ( Zanai Bhosle ) తో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు… తెగ ప్రచారం చేస్తున్నారు.
Also Read: Nitish Kumar Reddy Injury: SRH కి షాక్.. ఐపీఎల్ 2025 నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్?
వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని… కామెంట్స్ కూడా పెడుతున్నారు కొంతమంది నేటిజన్స్. ఇందులో భాగంగానే… తాజాగా ఓ పార్టీకి ఈ ఇద్దరు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. అయితే ఈ వార్తలు తెగ వైరల్ కావడంతో స్వయంగా మహమ్మద్ సిరాజు…. స్పందించడం జరిగింది. ఈ వార్తలను ఖండిస్తూ ఓ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు మహమ్మద్ సిరాజ్. ఆమె తన సోదరి అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో… ప్రముఖ సింగర్ జనై భోస్లే ( Zanai Bhosle ) పెట్టిన పోస్టును చూపిస్తూ… సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్.
తమ ఇద్దరిదీ అన్నాచెల్లెళ్ల బంధం అని అర్థం వచ్చేలా మహమ్మద్ సిరాజు పోస్ట్ పెట్టడం జరిగింది. నా ప్రియమైన సోదరుడా అంటూ ఆ సింగర్ జనై పోస్ట్ చేసిన దాన్ని ట్యాగ్ చేశారు మహమ్మద్ సిరాజ్. ట్యాగ్ చేయడమే కాకుండా… అన్న చెల్లెల బంధాన్ని వివరించే హిందీ పాటను కూడా… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహమ్మద్ సిరాజ్. దీంతో సింగర్ అలాగే మహమ్మద్ సిరాజ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని… వారిద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్.
Also Read: Australian Open 2025 Final: ఆస్ట్రేలియా ఓపెన్ – 2025 విజేతగా ఇటలీకి చెందిన సినర్
దీంతో ఉదయం నుంచి మహమ్మద్ సిరాజు పై పోస్టులు పెడుతున్న వారు… ముక్కున వేలేసుకున్నారు. ఇది ఇలా ఉండగా… ఇటీవల టీమిండియా జట్టులో… స్థానం కోల్పోయిన మహమ్మద్ సిరాజ్… రంజి ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. టీమిండియాలో అవకాశం దక్కాలంటే కచ్చితంగా.. దేశవాళి క్రికెట్ ఆడాల్సిందేనని… ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన ప్రకటన చేసింది.
దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, కె ఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ లందరూ రంజిత్రోఫీ ఆడుతున్నారు. ఇక ఇటు… మహమ్మద్ సిరాజ్ కూడా రంజిత్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. దేశవాళి క్రికెట్ లో రాణిస్తేనే మళ్లీ మహమ్మద్ సిరాజుకు తుది జట్టులో అవకాశం వస్తుంది. బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్లు… టీమిండియాలో గట్టి పోటీ ఇస్తున్నారు. అందుకే మొన్నటి చాంపియన్ ట్రోఫీ జట్టులో మహమ్మద్ సిరాజ్ పేరు లేకుండా పోయింది.
Mohd Siraj's Insta Story..✍🏻 pic.twitter.com/KS75fkxEGR
— RVCJ Media (@RVCJ_FB) January 26, 2025