Best Tablets Under 25,000 : రూ. 25 వేల రూపాయలు బెస్ట్ టాబ్లెట్స్ కొనాలనుకుంటున్నారా? ఇక ఈ నవంబర్లో ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన టాబ్లెట్స్ పై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్స్ తో టాబ్లెట్స్ సొంతం చేసుకోవాలనుకునేవారు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
Poco Pad 5G, OnePlus Pad Go, Honor Pad 9 ట్యాబ్లెట్స్ పై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. రూ.25000లోపే అధునాతన ఫీచర్స్ తో ఉన్నాయి. హై రిఫ్రెష్ రేట్, పెద్ద డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేక ఫీచర్స్ తో ఉన్న ఈ ట్యాబ్లెట్స్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
1) Poco Pad 5G – ఈ ట్యాబ్లెట్ ధర రూ. 2,560. 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 12.1-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియోకి సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే 600 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది. అదనపు రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో పాటు TÜV రైన్‌ల్యాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC తో నడుస్తుంది. 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TBకి మరింత విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే HyperOSలో నడుస్తుంది.
2) Honor Pad 9 – 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇది 12.1-అంగుళాల WQXGA TFT LCD డిస్‌ప్లే, 2560 x 1600 రిజల్యూషన్, 500 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ ను కలిగి ఉంది. టాబ్లెట్ Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్‌పై నడుస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి Adreno 710 GPUతో జత చేయబడింది. ఇది Android 13 ఆధారంగా Honor స్వంత MagicOS 7.2పై నడుస్తుంది. ఈ టాబ్లెట్ 13MP వెనుక షూటర్‌ను కలిగి ఉంది. అది 4k వీడియోలను షూట్ చేయగలదు. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ కు ముందు భాగంలో 8MP షూటర్ ఉంది. ఇది 8 స్పీకర్ సెటప్ తో పాటు 2 మైక్రోఫోన్‌లతో వస్తుంది. టాబ్లెట్ 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 8300mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
3) Xiaomi Pad 6 – Xiaomi ప్యాడ్ 6 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2880×1800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ను కలిగి ఉంది. 8GB వరకు RAM, ఆక్టా కోర్ Qualcomm Snapdragon 870 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. Xiaomi Pad 6 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది. వెనుకవైపు 13MP సెన్సార్, సెల్ఫీల కోసం 8MP కెమెరాతో వస్తుంది. Xiaomi ప్యాడ్ 6 8,840mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది.
4) OnePlus Pad Go LTE – OnePlus Pad Go ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్OS 13.2తో వస్తుంది. ఇది 11.35 అంగుళాల 2.4K (2408 x 1720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 220ppi పిక్సెల్ , 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. MediaTek Helio G99 SoC ద్వారా నడుస్తుంది. UFS 2.2లో 8GB LPDDR4X RAM, 256GB స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే బెస్ట్ ట్యాబ్లెట్ కొనాలనుకుంటే మీరు ఓ సారి ట్రై చేసేయండి.
ALSO READ : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!