Lover Kill Mother In Law| వివాహేతర సంబంధాల ఫలితం చివరకు బాధాకరంగానే ఉంటుంది. అయితే భార్య, భర్త లేదా వారితో వివాహేతర సంబంధం పెట్టకున్న ప్రేమికులో చాలా ఘటనల్లో మోసపోవడం, హత్యకు గురికావడం జరగుతూ ఉంటుంది. కానీ తాజాగా ఏ సంబంధం లేని ఒక మహిళ చనిపోయింది. ఒక ఇంటి కోడలు వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఓ అత్త వారి అక్రమ సంబంధానికి అడ్డుపడింది. దాంతో ఆ కోడలి ప్రేమికుడు తనకు అడ్డుగా ఆ అత్తను హత్య చేశాడు. ఈఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని దేవరియా గ్రామంలో నివసించే గాయత్రి దేవి (42) అనే మహిళ వారం రోజుల క్రితం హత్యకు గురైంది. ఆమె రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఒక యువకుడు ప్రవేశించి ఆమె నోట్లో తుపాకీ పెట్టి పేల్చాడు. దీంతో ఆమె ఆ క్షణమే మరణించింది. దీంతో ఇంట్లో మిగతా వాళ్లు చూసేసరికి ఆ యువకుడు మరెవరో కాదు. గ్రామంలో నివసించే సుందర్ యాదవ్. గాయత్రి దేవి కుమారుడు రంజన్, సుందర్ యాదవ్ స్నేహితులు కూడా. హత్య చేసిన తరువాత సుందర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు అతడిని పట్టుకున్నారు.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
సుందర్ యాదవ్ ని హత్య ఎందుకు చేశావ్ ? అని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు? దీంతో సుందర్ జరిగిన నిజమంతా చెప్పేశాడు. తానే హత్య చేశానని నేరం అంగీకరించాడు. నిజానికి గాయత్రి దేవి కుమారుడు రంజన్ కు సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే రంజన్, అతని మిత్రడు సుందర్ ఇద్దరూ కూలి పని చేసుకుని చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బిహార్ లో పనిలేక ఆరు నెలల క్రితం రాజస్థాన్ వెళ్లారు. రంజన్ వెంట అతని భార్య పాయల్ కూడా వచ్చింది. అయితే రాజస్థాన్‌లో ఉన్నప్పుడు రంజన్ ఇంటికి సుందర్ ఎక్కువగా వచ్చేవాడు. ఈ క్రమంలో పాయల్, సుందర్ ప్రేమించకున్నారు. వారి ద్దరి వివాహేతర సంబంధం గురించి ఎవరికీ తెలియదు.
కానీ కొన్ని రోజుల క్రితం రంజన్, తన భార్య పాయల్ తో తన స్వగ్రామం వచ్చాడు. తల్లిదండ్రులతో దీపావళి పండుగ వచ్చాడు. అలా వచ్చిన రంజన్ తిరిగి రాజస్థాన్ వెళ్లలేదు. అయితే పాయల్ కోసం వారి వెంటనే సుందర్ యాదవ్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో రంజన్ లేని సమయంలో పాయల్ తన ప్రేమికుడు సుందర్ యాదవ్ తో కలిసేది. సుందర్ కూడా ప్రతిరోజు ఏదో ఒక వంకతో పాయల్ ని కలిసేందుకు రంజన్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒకరోజు సుందర్, పాయల్ శృంగారం చేసుకుంటుండగా.. పాయల్ అత్త గాయత్రి దేవి చూసుకుంది. ఆ తరువాత సుందర్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లమని చెప్పింది. కోడలు పాయల్ ని కూడా మరోసారి ఇలా జరిగితే తన కొడుకు రంజన్ కు మొత్తం చెప్పేస్తానని హెచ్చరించింది. ఆ తరువాత నుంచి పాయల్, సుందర్ ఇద్దరికీ దొంగచాటుగా కలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది.
పాయల్ ని పొందేందకు ఉన్మాదిలా మారిన సుందర్ ఒక కత్తి, ఒక తుపాకీ తీసుకొని అర్ధరాత్రి సమయంలో పాయల్ ఇంట్లో దొంగచాటుగా ప్రవేశించాడు. అక్కడ నిద్రపోతున్న పాయల్ అత్త గాయత్రి దేవి మెడపై ఒక కత్తితో దాడి చేశాడు. కానీ ఆమె అంతటితో చావలేదు. అందుకే తుపాకీ ఆమె నోట్లో పెట్టి బుల్లెట్ పేల్చాడు. గాయత్రి దేవి చనిపోవడంతో పోలీసులు సుందర్ ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.