Ysrcp: వైసీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయా? సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా నియమించడమే ఇందుకు కారణమా? విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారా? ఈ అంశమే ఆ పార్టీలో చిచ్చుకు దారితీసిందా? అవుననే సంకేతాలు బలంగా ఆ పార్టీ నుంచి వెలువడుతున్నాయి. వైసీపీలో అసలేం జరుగుతోంది?
వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడానికి సజ్జల వ్యవహారశైలి కారణమంటూ ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. కొందరైతే ఆ పార్టీకి రాం రాం చేప్పేశారు. మళ్లీ సజ్జలను రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు జగన్. దీంతో నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.
దెబ్బ తిన్న ఫ్యాన్‌కి రిఫేర్ చేయడానికి మంచి మెకానిక్ వస్తారని నేతలు, కార్యకర్తలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. మళ్లీ పాత మెకానిక్‌కే ఇచ్చారన్న భావన నేతల్లో మొదలైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖమంత్రిగా పేరు పొందారాయన.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం, ప్రభుత్వ నిర్వహణలో సజ్జల ఫెయిల్ అయ్యారని, అందువల్లే 11 సీట్లకు పరిమితమయ్యామని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా విమర్శలు గుప్పించారు. 2014-19 సమయంలో విజయసాయిరెడ్డి హార్డ్‌గా పని చేశారని, ఆయన వల్ల అధికారంలోకి వచ్చిందని కొందరు నేతల మాట.
ALSO READ: బాలినేనికి ఎమ్మెల్సీ? డిసైడ్ చేసిన పవన్? త్వరలో ఒంగోలులో బహిరంగ సభ?
ఈసారి వీఎస్ఆర్‌కే కీలక పగ్గాలు అప్పగిస్తారని చాలామంది నేతలు భావించారు. ప్రస్తుతం జగన్ విశ్వాసానికే జగన్ పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు ఆరుగురు కో- ఆర్డినేటర్లను నియమించింది వైసీపీ. వారంతా సజ్జల ఆధీనంలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనిపై కొందరు సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించడం తేలికే.. పవర్ లేనప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడమన్నది ఆశామాషీ కాదని అంటున్నారు.
కీలక విషయాల్లో సజ్జల ఏ విధంగా సక్సెస్ అవుతారనేది ఇప్పుడు అసలు విషయం. ప్యాన్ పార్టీకి కొత్త మెకానిక్ రావడంతో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికర అంశం. వైసీపీ ఏది చెయ్యాలన్నా కచ్చితంగా జగన్ తెలియాల్సిందే. ఆయనకు తెలీకుండా ఏ పని జరగదన్నది కొందరి మాట. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.