
Biological age:- తీవ్రమైన జ్వరం నుండి బయటపడినా.. బిడ్డకు జన్మనిచ్చినా.. బాగా పార్టీ చేసుకొని అలసిపోయినా.. ఎందుకో సడెన్‌గా వయసు పెరిగిపోయినట్టు అనిపిస్తుంటుంది కదా.! అయితే దీని వెనుక సైంటిఫిక్‌గా కారణం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు, వ్యాయామంతో పాటు పొగత్రాగడం లాంటి అలవాట్లు కూడా మనిషి శరీరంలోని సెల్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయని తెలిపారు. అంతే కాకుండా దీనికి సంబంధించి మరెన్నో విషయాలను బయటపెట్టారు.
మనిషి వయసు అనేది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్నకొద్దీ శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే అవి మాత్రమే కాకుండా మనిషికి ఉండే అలవాట్లు, ఆరోగ్య సమస్యల వల్ల మనిషి వయసుకంటే సెల్స్ వయసు కాస్త భిన్నంగా ఉండే అవకాశాల ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనం బాగా అలసిపోయినట్టుగా ఫీల్ అవ్వడం, వయసు అయిపోతుంది అన్నట్టు అనిపించడం జరుగుతుందని తెలిపారు.
మామూలుగా కొన్ని సందర్బాలు మనిషి శరీరంపై తట్టుకోలేనంత ఒత్తిడిని తీసుకొస్తాయి. సర్జరీ జరగడం, కోవిడ్ సోకడం, గర్భవతి అవ్వడం.. ఇలా పలు విషయాలు మానసికంగా, శారీరికంగా మనిషి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాయి. అలాంటి సమయంలో ఏజ్ అనేది మనకు తెలియకుండానే పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ మంచి విషయం ఏంటంటే ఒత్తిడి లేకపోవడం అనేది ఏజ్‌ను తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఒత్తిడి వల్ల పెరిగిన ఏజ్.. ఒత్తిడి తగ్గిపోగానే వెంటనే మామూలు స్థితికి వచ్చేస్తుంది అన్నారు.
ఏజింగ్ అనేది అసలు ఎలా మారుతుందో తెలుసుకోవడం కోసం పలువురు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు. మనుషుల్లోనూ, ఎలుకల్లోనూ అసలు ఏజింగ్ అనేది ఎలా జరుగుతుంది తెలుసుకోవడం కోసం డీఎన్ఏపై పలు పరిశోధనలు చేశారు. ఒత్తిడి అనేది డీఎన్ఏలోని మాలిక్యూల్స్‌ను మార్చడంతో పాటు బయోలజికల్ ఏజ్‌ను పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సర్జరీ జరిగిన వారిలో, గర్భవతులలో, కోవిడ్ సోకిన వారిలో బయోలజికల్ ఏజ్ అనేది మామూలు శాతం కంటే ఎక్కువ తొందరగా పెరిగిపోతుందని వారు గమనించారు.
ఒత్తిడి వల్ల బయోలజికల్ ఏజ్ అనేది పెరుగుతున్న వారిలో ఆ స్పీడ్‌ను తగ్గించడం కోసం మార్కెట్లో పలు డ్రగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇవి మనిషి బయోలజికల్ ఏజ్ స్పీడ్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ మందులు కొన్ని సెల్స్, టిష్యూల బయోలజికల్ ఏజింగ్‌ను తగ్గించడంతో పాటు పూర్తిగా మనిషి బయోలజికల్ ఏజ్‌ను తగ్గిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు చేయాల్సి ఉంది.
MBRSC:- చంద్రుడిపై కాలు పెట్టే అనుభూతి.. అందరికీ ఉచితంగా