RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు మంగళవారం తెల్లవారుజామున.. గుండె నొప్పి రావడంతో.. వెంటనే చన్నైలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది అత్యవసర చికిత్య కాదని ఆస్పత్రి యాజమాన్యం ధృవీకరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు గంటల్లో డిశ్చార్చ్ కూడా అవుతారని ఆర్‌బిఐ ప్రతినిధి వెల్లడించింది.
వచ్చేనెల ముగియనున్న పదవీకాలం..
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వచ్చేనెల పదవీకాలం ముగియనుంది. 2018 డిసెంబర్ 12న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో శక్తికాంత్ దాస్‌ను కేంద్రం నియమించింది. శక్తికాంత్ దాస్‌కు గత 38 సంవత్సరాలలో వివిధ పాలనా రంగాలలో అపారమైన అనుభవం ఉంది. శక్తికాంత్ దాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
RBI గవర్నర్ శక్తికాంత్ దాస్‌ను “గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023″గా నిలిచారు. కరోనాతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ ద్రవ్యోల్బణాన్ని అధికమించడంతో శక్తికాంత్ దాస్ పనితీరును ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాండింది.