E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కీలక మార్పులు.. ఇకపై వారికే మొత్తం బాధ్యతలు!

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కీలక మార్పులు.. ఇకపై వారికే మొత్తం బాధ్యతలు!
Advertisement

Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం పర్యవేక్షణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న ట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షులను చైర్మన్లుగా నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.ఈ నియామకాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి తమకు తగిన ప్రాధాన్యత, ప్రోటోకాల్ దక్కడం లేదని పలువురు డీసీసీ అధ్యక్షులు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రోటోకాల్ సమస్య..

ఎలాంటి నామినేటెడ్ పదవులు లేకపోవడంతో అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదిక పైకి వెళ్లలేకపోతున్నామని, కనీసం అధికారులతో సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉండటం లేదని వారు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తున్న తమకు అధికారిక హోదా లేకపోవడంతో కార్యకర్తల పనులు కూడా చేయించలేకపోతున్నామనే భావన వారిలో వ్యక్తమవుతోంది.ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్-చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కు వివరించారు. కొందరు డీసీసీ అధ్యక్షులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జిల్లా అధ్యక్షులకు ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కల్పించాలని, తద్వారా ప్రోటోకాల్ సమస్యకు పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

కీలక నిర్ణయమే..?

Advertisement

డీసీసీ అధ్యక్షుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధిష్ఠానం ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, వారికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీల చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఒకవైపు డీసీసీ అధ్యక్షులకు ప్రోటోకాల్ సమస్య తీరడంతో పాటు, మరోవైపు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన పేదలకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉందని, విధివిధానాలు ఖరారైన వెంటనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి.

Also read: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?

పొలిటికల్ మైలేజ్ కు ఛాన్స్..

Advertisement

ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు జిల్లా చైర్మన్లుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఆయా నేతల పొలిటికల్ కెరీర్‌కు భారీ మైలేజ్ ఇచ్చే కీలక మలుపుగా మారనుంది. కేవలం ప్రోటోకాల్ సమస్యను పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్తులో వారు చట్టసభల్లో (అసెంబ్లీ, పార్లమెంట్) అడుగుపెట్టేందుకు కూడా సులువుగా మారనున్నది. సాధారణంగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసే నేతలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ, అధికారిక హోదా లేకపోవడంతో ప్రజల్లోకి నేరుగా వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల చైర్మన్లుగా నియమితులైతే, జిల్లా స్థాయిలో నిర్వహించే అధికారిక సమీక్షలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమానంగా వేదికపై ప్రోటోకాల్ గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం దక్కుతుంది.

పొలిటికల్ మైలేజ్..

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఆశించే డీసీసీ అధ్యక్షులకు, ఈ పదవి ద్వారా లభించే ప్రజాదరణ, పరిపాలనా అనుభవం అత్యంత కీలకమైన ‘పొలిటికల్ మైలేజ్’గా మారనుంది. అంతేగాక నియోజకవర్గాలకు మరింత వేగంగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు డీసీసీ అధ్యక్షులు కీలక వారధులుగా పనిచేయనున్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి పేదవాడికి వేగంగా అందేలా వారు చొరవ తీసుకునే వీలుంటుంది.

Also Read: యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

Tags

Related News

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు!

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సోదరుడిపైనా కేసు నమోదు!

తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌‌తో రాజగోపాల్‌-అనిరుధ్ భేటీ.. చర్యలు తప్పవు, పదవులు దూరం చేసుకోవద్దని సూచన

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

Big Stories

Advertisement
×