E-Paper
Advertisement

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..మార్కెట్‌ను షేక్ చేస్తున్న బోట్ ఎయిర్‌బడ్స్

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..మార్కెట్‌ను షేక్ చేస్తున్న బోట్ ఎయిర్‌బడ్స్
Advertisement

BoAt Airdopes 141 Gen 2: ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు అందించే గ్యాడ్జెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా వైర్‌లెస్ మ్యూజిక్ ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ మంచి ఇయర్‌ బడ్స్ కోసం చూస్తుంటారు. ఈ కోవకే.. చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్, తన కొత్త మోడల్‌ను అత్యంత తక్కువ ధరలో విడుదల చేసింది. అసాధారణమైన బ్యాటరీ బ్యాకప్ , లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ కొత్త గ్యాడ్జెట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మ్యూజిక్ లవర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అనేక రకాల గార్జెట్ లను అందించే.. బోట్ కేవలం కస్టమర్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన డివైస్‌లలో boAt Airdopes 141 Gen 2 ఒకటి. సుమారు రూ.1099 ధరలలో లభించే ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్, మార్కెట్లో నేడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిలోని ప్రత్యేకతలు, ఫీచర్లు..

 boAt Airdopes 141 Gen 2 ఫీచర్లు:

Advertisement

1. బ్యాటరీ బ్యాకప్ ,ఫాస్ట్ చార్జింగ్:

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేసుతో కలిపి.. ఇది మొత్తం 48 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. అంటే.. ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. రోజంతా మ్యూజిక్ లేదా కాల్స్ గురించిన టెన్షన్ ఉండదు. అంతేకాకుండా.. ఇందులో.. ASAP ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. దాదాపు 180 నిమిషాల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు.

Advertisement

2.4 మైక్స్ ENx టెక్నాలజీ:

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మాట్లాడేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఇబ్బందికరంగా మారుతుంది. దీనిని నివారించడానికి.. ఈ ఇయర్‌ బడ్స్‌లో 4 మైక్స్‌తో కూడిన ENx టెక్నాలజీని చేర్చారు. దీని వల్ల అవతలి వారికి.. మీ గొంతు ఎంతో స్పష్టంగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తుంది. ఆఫీస్ మీటింగ్స్.. లేదా  కాల్స్‌కు ఇది నూటికి నూ శాతం సరి పోతుంది.

3. బీస్ట్ మోడ్:

మీకు మొబైల్ గేమింగ్ అలవాటు ఉందా ? అయితే ఇందులో.. ఉన్న స్పెషల్ మోడ్ మీకు ఎంతగానో నచ్చుతుంది. కేవలం 65ms తక్కువ లేటెన్సీ కలిగి ఉండటం వల్ల ఆడియో , వీడియో మధ్య ఎలాంటి ఆలస్యం జరగకుండా పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. గేమింగ్ సమయంలో శబ్దాలు క్షణాల్లో వినిపించడం ద్వారా మంచి అనుభూతిని ఇస్తుంది.

Also Read: ఇంట్లోనే పర్ఫెక్ట్ పిజ్జా, కేక్స్ కోసం.. టాప్-5 స్మార్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్

ఇతర ముఖ్యమైన ఫీచర్లు:

బ్లూటూత్ v5.4: లేటెస్ట్ కనెక్టివిటీతో ఫాస్ట్ సిగ్నల్స్ అందుతాయి.

ఫ్రీ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఆఫర్లు: కొన్ని ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా.. మ్యూజిక్ స్ట్రీమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.

IPX4 వాటర్ రెసిస్టెంట్: వ్యాయామం చేసేటప్పుడు.. లేదా వర్షంలో చెమట, నీటి నుంచి ఇయర్‌ బడ్స్ పాడవకుండా ఉంటాయి.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, కాలింగ్ క్లారిటీ కోరుకునే వారికి boAt Airdopes 141 Gen 2 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రూ.1099 ధరలో లభించే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గ్యాడ్జెట్ ఇది.

Related News

మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లు,తక్కువ ధర.. ఊరమాస్ డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్!

స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? డూప్లికేట్ ఫొటోలు, వీడియోలను ఇలా ఈజీగా డిలీట్ చేయండి!

పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

Apple Watch Series 12లో కొత్త ప్రాసెసర్, ఎఐ ఫీచర్లు.. యాపిల్ లవర్స్‌కు పండగే!

వంట పనిని సగం తగ్గించే 6 కిచెన్ సాధనాలు.. ప్రతీ ఇంట్లోనూ ఇవి ఉండాల్సిందే!

ఇంట్లోనే పర్ఫెక్ట్ పిజ్జా, కేక్స్ కోసం.. టాప్-5 స్మార్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్

బోల్ట్ నుంచి మొదటి ఏఐ ఫోన్.. టెక్నో నుంచి గేమింగ్ బీస్ట్, ఏ రోజు లాంచ్ అవుతున్నాయంటే?

Big Stories

Advertisement
×