Aadarsha Kutumbam Teaser: విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47(Aadarsha Kutumbam House no.47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలనే సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫ్యామిలీకి ఏదైనా ఆపద వస్తే కాపాడుకునే హీరోగా వెంకటేష్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే సబ్బుకి డబ్బుకి ఒకే పోలిక ఉంది మొదటిది చూస్తుండగానే కరిగిపోతుంది. రెండోది ఆలోచించే లోగా అరిగిపోతుంది అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. ఇక ఈ టీజర్ చూస్తుంటే మాత్రం అప్పు చేస్తున్న భార్య అప్పులు తీర్చే ఒక సామాన్య మధ్య తరగతి భర్త పాత్రలో వెంకటేష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ వీడియోలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కొంచెం యాక్షన్ ఎలెమెంట్స్ కూడా జత చేసి విడుదల చేశారు.
ఈ టీజర్ వీడియోలో వెంకటేష్ డైలాగ్ చెబుతూ “ఫ్యామిలీ ఇమేజ్ ఉందనే విషయం నాకు తెలుసు.. సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి కూడా వెనకాడను” అనే డైలాగ్ తో పాటు “నది గట్టు దాటితే వరద అంటారు అదే సముద్రం దాటితే ఉప్పెన” అంటారు. కానీ సామాన్యుడు దాటితే మాత్రం దానికి ఒక బలమైన పదం ఉంది దాన్ని మీరే వెతకండి అంటూ సాగిపోతున్న డైలాగ్స్ తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే వెంకటేష్ సినిమా అంటే ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ఈ సినిమాలో కాస్త యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. మొత్తానికి టీజర్ మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా రెండో తేదీ విడుదలవుతుందని స్వయంగా నాగ వంశీ చెప్పినప్పటికీ విడుదల విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ టీజర్ విడుదల చేస్తూ ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మరోసారి చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. విడుదలకు కొద్దిరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయబోతున్నట్టు నాగ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. వచ్చేవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందని, తదుపరి వారం ట్రైలర్ కూడా ఉండబోతుందని నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు..
Also Read: సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!