E-Paper
Advertisement

కరెంట్ పోయినా 40 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్.. బోట్ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ 219 లాంచ్

కరెంట్ పోయినా 40 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్.. బోట్ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ 219 లాంచ్
Advertisement

Boat airdopes 219 price in india: ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ అయినా, ఆఫీస్ గోయర్స్ అయినా.. చేతిలో ఫోన్ ఉంటే చెవిలో ఇయర్‌బడ్స్ ఉండాల్సిందే. అయితే బడ్జెట్ ధరలో.. మంచి ఇయర్‌బడ్స్ కొనాలంటే కాలింగ్ క్వాలిటీ అస్సలు నచ్చదు. అవతలి వాళ్లకు మన వాయిస్ సరిగ్గా.. వినపడక సగం ప్రాణం పోతుంది. కానీ మీ కాలింగ్ టెన్షన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టడానికి బోట్ కంపెనీ నుంచి Boat Airdopes 219 వచ్చేసింది. క్వాడ్ మైక్ (4 Mics), ENx టెక్నాలజీతో కాలింగ్ కోసం సెగ్మెంట్‌లోనే బెస్ట్‌గా నిలిచిన ఈ బడ్జెట్ రూలర్ గురించి ఇప్పుడు చూద్దాం.

మీరు ట్రాఫిక్‌లో ఉన్నా, బస్సులో జర్నీ చేస్తున్నా లేదా ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నా అవతలి వ్యక్తికి మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్‌గా వెళ్లాలంటే మంచి మైక్స్ ఉండాలి. Boat Airdopes 219 సరిగ్గా ఇదే పాయింట్‌ని టార్గెట్ చేసింది.రూ. 1500 లోపు బెస్ట్ కాలింగ్ ఇయర్‌బడ్స్ కోసం వెతికే వాళ్లకు ఇది టాప్ ఛాయిస్‌గా మారింది.

Boat Airdopes 219 పూర్తి ఫీచర్లు:

1. 4 మైక్స్ & ENx టెక్నాలజీ (కాలింగ్ అదుర్స్!):

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో ఒక్కో బడ్‌లో రెండు చొప్పున మొత్తం 4 మైక్రోఫోన్లు (Quad Mics) ఇచ్చారు. దీనికి తోడు బోట్ సిగ్నేచర్ ENx టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను పూర్తిగా ఫిల్టర్ చేస్తుంది. మీరు బైక్ మీద వెళ్తున్నా లేదా క్రౌడెడ్ ఏరియాలో ఉన్నా, చుట్టుపక్కల వచ్చే గోలని ఇది కట్ చేసి, మీ వాయిస్‌ని మాత్రమే అవతలి వాళ్లకి పంపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ దొరకడం చాలా అరుదు.

2. 40 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్:

చార్జింగ్ టెన్షన్ ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ బడ్స్ కేస్‌తో కలిపి ఏకంగా 40 గంటల (40H) ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. ఇందులో బోట్ కి చెందిన ‘ASAP Charge’ టెక్నాలజీ ఉంది. కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు, ఏకంగా 120 నిమిషాల (2 గంటలు) వరకు హ్యాపీగా సాంగ్స్ వినొచ్చు లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. టైప్-సి చార్జింగ్ పోర్ట్ ఉండటం అదనపు అడ్వాంటేజ్.

3. బోట్ సిగ్నేచర్ సౌండ్ :

Advertisement

మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 13mm డ్రైవర్స్ ఇచ్చారు. దీనివల్ల బేస్ హెవీగా, పంచ్‌గా ఉంటుంది. థంపింగ్ బేస్ ఇష్టపడే తెలుగు యూత్‌కి ఈ సౌండ్ సిగ్నేచర్ బాగా నచ్చుతుంది. ఇక గేమర్స్ కోసం ఇందులో BEAST Mode ఇచ్చారు. ఇది లో లేటెన్సీని అందిస్తుంది. అంటే మీరు పబ్జీ లేదా ఫ్రీఫైర్ ఆడేటప్పుడు గన్ సౌండ్స్ అండ్ ఎనిమీ ఫుట్‌స్టెప్స్ లాగ్ లేకుండా వినపడతాయి.

4. డిజైన్, కనెక్టివిటీ:

ఇవి చాలా లైట్ వెయిట్‌గా.. చెవిలో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలా ఉంటాయి. జిమ్‌కి వెళ్లేవాళ్లకు, రన్నింగ్ చేసేవాళ్లకు ఐడెంటికల్‌గా ఉంటుంది ఎందుకంటే ఇది IPX5 వాటర్ & స్వెట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బ్లూటూత్ v5.3,IWP (Instant Wake N’ Pair) టెక్నాలజీ వల్ల కేస్ ఓపెన్ చేయగానే ఫోన్‌కి ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోతాయి.

Also Read: 60% డిస్కౌంట్‌తో రోబోట్ క్లీనర్.. కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు !

Boat Airdopes 219 ధర ఎంత?

సాధారణంగా బోట్ ఇయర్‌బడ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి.

సాధారణ ధర: రూ.3,990

అమెజాన్ ఆఫర్ ధర: ప్రస్తుతం అమెజాన్ , బోట్ అఫీషియల్ సైట్లలో ఇది కేవలం రూ.999లోపు లభిస్తోంది. ఈ ప్రైస్ పాయింట్‌లో 4 మైక్స్ , 40 గంటల బ్యాటరీ రావడం అంటే నిజంగా వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పొచ్చు.

మీకు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, ఆఫీస్ కాల్స్ లేదా పర్సనల్ కాల్స్ మాట్లాడటానికి మంచి మైక్ క్వాలిటీ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకుని Boat Airdopes 219 ని ఆర్డర్ చేసుకోవచ్చు. చార్జింగ్ భయం లేకుండా లాంగ్ జర్నీలకి ఇది బెస్ట్ పార్ట్‌నర్. ప్రస్తుతం అమెజాన్‌లో దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి.

Related News

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

Big Stories

Advertisement
×