BoAt Airdopes Plus 224 Review: మ్యూజిక్ లవర్స్‌కు ఎప్పుడూ ట్రెండింగ్ గాడ్జెట్స్ అందుబాటులో ఉంచే ప్రముఖ బ్రాండ్ బోట్ మరో అద్భుతమైన ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అసాధారణమైన సౌండ్ క్వాలిటీ, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 999 బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ బ్లూటూత్ v6.0 ఇయర్ బడ్స్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, లాంచ్ ఆఫర్లు , సేల్స్ సందర్భంలో ఇది కేవలం రూ. 999 ధరకే యూజర్లకు లభిస్తోంది. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో ఇంతకంటే మెరుగైన ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది మ్యాట్టే బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ దీని సౌండ్ క్వాలిటీ. ఇందులో పవర్ ఫుల్ 13 mm డ్రైవర్లను అమర్చారు. దీని వల్ల పాటల్లోని బేస్, ట్రెబుల్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి.అంతేకాకుండా ఇందులో స్పాటియల్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల సినిమా చూసేటప్పుడు.. లేదా గేమ్స్ ఆడేటప్పుడు చుట్టూ శబ్దం వస్తున్నట్లు అద్భుతమైన థియేటర్ ఫీల్ ఇస్తుంది.
మనం ఆరు బయట లేదా ఎక్కువ జనం ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ మాట్లాడితే.. పక్కనున్న శబ్దాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో క్వాడ్ మైక్స్, AI-ENx టెక్నాలజీని వాడారు. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసి.. అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.
ఈ మోడల్ లేటెస్ట్ Bluetooth v6.0 టెక్నాలజీతో వస్తుంది. దీని వల్ల కనెక్షన్ చాలా వేగంగా ఉంటుంది. అంతే కాకుండా కట్ అయ్యే సమస్య ఉండదు. అలాగే ఇందులో స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. దీని సహాయంతో.. మీ ల్యాప్‌టాప్, ఫోన్ మధ్య ఇయర్ బడ్స్‌ను ఒకే టైంలో ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు. బోట్ యాప్ సపోర్ట్ ద్వారా మీరు టచ్ కంట్రోల్స్ , ఈక్వలైజర్‌ను మీ ఇష్టానుసారం కస్టమైజ్ చేసుకోవచ్చు.
Also Read: రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!
బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాలంటే.. ఈ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 60 గంటల పాటు పని చేస్తాయి. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్దిసేపు ఛార్జ్ చేసినా గంటల తరబడి బ్యాకప్ లభిస్తుంది. మ్యాట్టే బ్లాక్ డిజైన్ చాలా స్టైలిష్‌గా , ప్రీమియంగా కనిపిస్తుంది. రూ.1,000 లోపు బడ్జెట్‌లో అదిరి పోయే ఫీచర్లు, ట్రెండీ లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ మోడల్ పర్ఫెక్ట్, బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.