E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !
Advertisement

Idupu Kayitam: బలగం సినిమాతో సత్తా చాటిన ప్రియదర్శి హీరోగా తాజాగా మొదలైన సినిమా ‘ఇడుపు కాయితం’. వంశీకృష్ణ దొండపాటి దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీ వాసు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా ఘనంగా ప్రారంభమైంది అయితే సినిమాల ప్రారంభమైందో లేదో దీని చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి . ఇడుపు కాయితం అనేది పూర్తిగా తెలంగాణ పదమవడంతో ఆంధ్ర ప్రదేశ్ కి  చెందిన కొందరు నెటిజన్లు,ట్రోలర్స్ సినిమాపై సెటైర్స్  వేయడం మొదలు పెట్టారు .

ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ చేస్తారా లేదా డబ్బింగ్ చేస్తారా

‘ఇడుపు కాయితం’..పేరేంటి ..తెల్లకాగితం అనే సినిమా తెలుసుకాని ఈ ‘ఇడుపు కాయితం’సినిమా ఏంటి ..అసలు ఈపేరే కొత్తగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కొందరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. ఒకవేళ దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ చేస్తారా లేదా డబ్బింగ్ చేస్తారా ఒకవేళ రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తే సబ్ టైటిల్స్ కూడా వేయాలేమో అంటూ సినిమాపై సోషల్ మీడియాలో కొంతమంది ఆంధ్ర నెటిజన్లు చేయడం మొదలు పెట్టారు .

Advertisement

దీంతో తెలంగాణకు చెందిన కొంతమంది ప్రముఖులు ఉద్యమకారులు వారికి కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. ఇడుపు కాయితం అంటే భార్యాభర్తలు విడిపోవడానికి ఇద్దరు మధ్య అంగీకారంతో రాసుకునే ఒక ఒప్పందపత్రమని (డైవోర్స్ పేపర్)తెలంగాణ వచ్చి దాదాపు 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా మా భాష యాస మీద సెటైర్లు వేయడం ఏం మారలేదని ఇకనైనా దీని తగ్గించుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చారు.

Advertisement

also read:చిత్ర పరిశ్రమలో తీరని లోటు.. భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ కన్నీటి వీడ్కోలు!

చూస్తే చూడండి లేకపోతే లేదు

ఇక సినిమాకి సబ్ టైటిల్స్ అసలు ఉండవని చూస్తే చూడండి లేకపోతే లేదు అంటూ గంటా చక్రపాణి లాంటి వారు ఘాటుగానే విమర్శించారు . ఇక మరి కొంతమంది మాట్లాడుతూ ఇలా తెలంగాణ భాషను వెటకారం చేయడం సంస్కారం అనిపించుకుంటుందా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మరి కొంతమంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇది ఇడుపు కాయితం అంటూ ట్రోలర్లకు గట్టిగా బుద్ధి చెప్పారు.

ఇక నాలుగు ప్రశ్నలు అడిగితె కుదరదు,మన సినిమాలని ,కథలని యాక్సెప్ట్ చెయ్యలేరు ఇట్స్ ఒకే,మా ప్రియదర్శి గాడు చింపేస్తాడు ,అయినా ఏం పర్లేదు.మన కథలని మా బాషలోనే చెప్పుకుంటాం అంటూ  అంటూ  రాహుల్ రామకృష్ణ లాంటి వారు తెలంగాణా అస్తిత్వానికి మద్దతుగా నిలవడం విశేషం.

ఈ ఇడుపు కాగితం ఎలాంటి సమాధానం ఇస్తుందో

ఏది ఏమైనా ..చూస్తుంటే ఈ ఇడుపు కాయితం వ్యవహారం మరోసారి ఆంద్రా,తెలంగాణా ప్రజల మధ్య మంటలు పెట్టేలానే కనిపిస్తుంది.ఇక ఇదే విషయమై బన్నీ వాసు రియాక్ట్ అవుతూ టైటిల్ మార్చే దేశం ఏమాత్రం లేదని ఈ కథ మా దగ్గరికి టైటిల్ తోనే వచ్చిందని ఇది కథకి సరైన టైటిలని కాబట్టి ఇదే టైటిల్ తో ముందుకు వెళ్తామని తెలిసి చెప్పారు. ఏది ఏమైనా ఒక మంచి టైటిల్ తో ఆడియో ముందుకి రాబోతున్న చిత్ర యూనిట్ కి ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం నిజంగా బాధాకరం నిజానికి బలగం సినిమా విడుదలైన మొదట్లో కూడా చాలామంది ఇలా అన్నవారు చూడాలి మరి మాకు అర్థం కాలేదు అని అంటున్న వారికి ఈ ఇడుపు కాగితం ఎలాంటి సమాధానం ఇస్తుందో

Related News

OG యూనివర్స్ ఎక్స్‌పాండ్.. మేకర్స్ నుండీ మరో సర్‌ప్రైజ్!

పెళ్లి, విడాకులపై త్రిష కామెంట్స్!

వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?

ఖుష్బూ కుమార్తె పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. ఈమె ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్!

చిత్ర పరిశ్రమలో తీరని లోటు.. భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ కన్నీటి వీడ్కోలు!

వయసు 94.. కానీ విజన్ నెక్స్ట్ లెవెల్…వైరల్ అవుతున్న ‘సింగ్ గీతం’మేకింగ్ వీడియో

పోస్టర్స్ పై నంబర్స్ ఎవడడిగాడు….బ్లాస్ట్ అయిన దిల్ రాజు !

Big Stories

×