E-Paper
Advertisement

BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!

BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL).. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ డేటా, ఎక్కువ వాలిడిటీ కోరుకునే వారి కోసం BSNL రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్ టెల్, జియో వంటి ప్రైవేటు టెలికాం సంస్థలు.. ఈ ధరలో అందించని ఎన్నో ప్రయోజనాలను బీఎస్ఎల్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.599 ప్లాన్ వివరాలు

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 70 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీ రోజూ 3 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వాలిడిటీ కాలానికి గానూ వినియోగదారులు 210 జీబీ డేటాను పొందుతారు. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిసినా.. 40 Kbps స్పీడ్ తో ఇంటర్నెట్ ను అపరిమితంగా వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. అదే విధంగా రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపుకోవచ్చు.

ఎవరికి బెనిఫిట్?

Advertisement

రోజువారీ డేటా వాడకం ఎక్కువగా ఉండే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలాగే ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, యూట్యూబ్ లేదా ఓటీటీలలో కంటెంట్ ఎక్కువగా చూసే వారికి రోజూ వచ్చే 3జీబీ డేటా సరిగ్గా సరిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఆశించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read: ఇక చీపురుతో పనిలేదు.. రూ.5,000లోపే ఇల్లంతా క్లీన్ చేసే.. సూపర్ వాక్యూమ్ క్లీనర్స్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

BSNL రూ. 599 ప్లాన్‌ను పలు పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘BSNL Selfcare’ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రీఛార్జ్ సెక్షన్‌లోకి వెళ్లి ఈ ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, కార్డ్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. లేదంటే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మెుబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఆన్ లైన్ లో రీఛార్జ్ చేసుకోవచ్చు. లేనిపక్షంలో గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ లోకి వెళ్లైనా రీఛార్చ్ చేసుకోవచ్చు.

Also Read: బార్‌కోడ్ vs క్యూఆర్ కోడ్.. రెండింటికి తేడా ఏంటి? ఏది ఎక్కువ పవర్‌ఫుల్?

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×