E-Paper
Advertisement

420 హామీల వైఫల్యం.. కాంగ్రెస్ పతనం ఖాయం.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

420 హామీల వైఫల్యం.. కాంగ్రెస్ పతనం ఖాయం.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
Advertisement

KTR: తెలంగాణలో కాంగ్రెస్ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే అంశం కాంగ్రెస్ చేయించుకున్న సొంత సర్వేలోనే తేలిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతగా స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో స్పష్టంగా తేలిందన్నారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలతో కేటీఆర్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరోసారి ప్రజలు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే కాంగ్రెస్ నేతలు గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా కాలేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని కేసీఆర్ అన్నారు. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపి లాంటి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని కేటీఆర్ అన్నారు.

Also Read: హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్.. 1100 మంది పోలీసులతో.. ఇళ్లల్లో సోదాలు!

Advertisement

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సర్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫీడ్‌బ్యాక్ వస్తోందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత కీలకమైన అంశమని.. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించబడకుండా చూడాలన్నారు.

Also Read: Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. సర్ ప్రక్రియపై డెడ్ లైన్ పెట్టిన అధికారులు.. చివరి తేదీ..?

Related News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు

నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, నేతల్లో కలకలం

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

Big Stories

Advertisement
×