E-Paper
Advertisement

వానొచ్చినా నో టెన్షన్.. నీటిలో తడిచినా అదరగొట్టే.. టాప్-5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు!

వానొచ్చినా నో టెన్షన్.. నీటిలో తడిచినా అదరగొట్టే.. టాప్-5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు!
Advertisement

Waterproof Smartwatch: ప్రస్తుత వర్షాకాలంలో స్మార్ట్ వాచ్ లను వాడాలంటే చాలా మంది సందేహిస్తుంటారు. అనుకోకుండా భారీ వర్షంలో చిక్కుకున్నప్పుడు వాచ్ పాడైపోతుందేమోనని తెగ భయపడుతుంటారు. వారి ఆందోళనకు చెక్ పెడుతూ.. మార్కెట్లోకి ఎన్నో రకాల వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ లు వచ్చాయి. అందులో అత్యుత్తమమైన ఐదింటిని ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Fire Boltt Rise

ఈ స్మార్ట్‌వాచ్ 1.85 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. మెటల్ బాడీతో క్లాసిక్ లుక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉండటం వల్ల వర్షపు జల్లులను, నీటి తుంపర్లను తట్టుకోగలదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, రొటేటింగ్ క్రౌన్, 123 స్పోర్ట్స్ మోడ్స్, SpO2, హార్ట్ రేట్ మానిటర్స్ ఉన్నాయి.

Noise Pulse 2 Max

Advertisement

నాయిస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ వాచ్ బడ్జెట్ ధరలో అత్యుత్తమ ప్రొటెక్షన్ ను అందిస్తుంది. దీనికి IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది. కాబట్టి భారీ వర్షంలో తడిసినా, నీటిలో కాసేపు మునిగినా ఏం కాదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. 1.85 ఇంచుల డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్, 100 స్పోర్ట్స్ మోడ్స్ దీని సొంతం.

Alexa In-built Womens Smart Watch

ప్రత్యేకంగా మహిళల కోసం డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్ ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో రూపొందింది. కాబట్టి వర్షంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు . 1.91 అంగుళాల HD డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ అలెక్సా వాయిస్ సపోర్ట్, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీప్, హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లను ఇది కలిగి ఉంది.

Hungama HiLife G1

Advertisement

మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం హంగామా అందిస్తున్న ఈ స్మార్ట్‌వాచ్ IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది. వర్షంలో తడిసినా దీని ఇంటర్నల్ పార్ట్స్ పాడవకుండా ఉంటాయని కంపెనీ చెబుతోంది. 1.75 అంగుళాల ఫుల్ టచ్ HD డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ కోసం బిల్ట్-ఇన్ స్పీకర్ అండ్ మైక్ ను ఇది కలిగి ఉంది. అలాగే బ్లడ్ ప్రెజర్, SpO2, హార్ట్ రేట్ మానిటర్లతో పాటు మల్టిపుల్ వాచ్ ఫేసెస్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Also Read: ఫోన్ కింద పడినా నో ప్రాబ్లం.. మిలిటరీ గ్రేడ్ బాడీతో వచ్చేస్తోన్న Realme Narzo 100x 5G!

MonkeyMan ApeWatch Rampage

ప్రీమియం లుక్, క్వాలిటీ డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇది అత్యుత్తమ వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో రావడం వల్ల వర్షంలో తడిచినా ఏం కాదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 1.39 ఇంచుల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, SpO2, హార్ట్ రేట్ ట్రాకింగ్, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రూపొందింది.

Also Read: వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికినా మురికిగా ఉన్నాయా? ఈ 5 తప్పులే కారణం!

Related News

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

Big Stories

Advertisement
×