E-Paper
Advertisement

Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!

Addanki Dayakar: కేసీఆర్ రాసి పెట్టుకో.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాస్ వార్నింగ్!
Advertisement

Addanki Dayakar: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన సొంత పార్టీని పటిష్టం చేసుకోలేక, సోషల్ మీడియా వేదికగా, నకిలీ సర్వేల పేరుతో ప్రజలను, తన క్యాడర్‌ను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌కు సవాల్..

ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.​”నేనే మళ్లీ సీఎం అవుతా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పిన మాటలకు భయపడే.. కేటీఆర్ ఇప్పుడు దొంగ సర్వేల పేరు జపిస్తున్నారని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు సవాల్ విసురుతూ.. “కేసీఆర్ రాసి పెట్టుకో.. ఈ రాష్ట్రానికి 2035 వరకు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంటారు” అని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. సర్ ప్రక్రియపై డెడ్ లైన్ పెట్టిన అధికారులు.. చివరి తేదీ..?

​బీజేపీతో సీట్ల బేరం కోసమే ఆరాటం..

​బీఆర్ఎస్ మనుగడ సాగించాలంటే బీజేపీతో కలవడం తప్ప మరో మార్గం లేదని అద్దంకి దయాకర్ విశ్లేషించారు. “​బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బీఆర్ఎస్‌కు కాస్తో కూస్తో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో బీజేపీతో సీట్ల బేరసారాలు కుదుర్చుకోవడానికే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ​కల్వకుంట్ల కుటుంబంలో గందరగోళం.. కూల్చిన కాళేశ్వరం! బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందని” దయాకర్ అన్నారు. “అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టే కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా కూల్చేసింది” అని ధ్వజమెత్తారు.

Advertisement

Also read: Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Related News

Home Guards: దేశవ్యాప్తంగా హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు

Musi Rejuvenation: మూసీ పునరుజ్జీవనానికి మరో ముందడుగు.. జీవో జారీ చేసిన సర్కార్!

420 హామీల వైఫల్యం.. కాంగ్రెస్ పతనం ఖాయం.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

MP Arvind: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ ఓపెన్ ఛాలెంజ్.. అది చేయాలని డిమాండ్..?

Big Stories

Advertisement
×