E-Paper
Advertisement

ఫోన్ కింద పడినా నో ప్రాబ్లం.. మిలిటరీ గ్రేడ్ బాడీతో వచ్చేస్తోన్న Realme Narzo 100x 5G!

ఫోన్ కింద పడినా నో ప్రాబ్లం.. మిలిటరీ గ్రేడ్ బాడీతో వచ్చేస్తోన్న Realme Narzo 100x 5G!
Advertisement

Realme Narzo 100x 5G: టెక్ ప్రియులకు రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లోకి సరికొత్త నార్జో సిరీస్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధం చేసింది. ‘రియల్‌మి నార్జో 100x 5G’ పేరుతో రాబోతున్న ఈ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ జులై 15న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో అధికారికంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీలు అమెజాన్, రియల్‌మి వెబ్‌సైట్లలో ఇప్పటికే లైవ్ అయ్యాయి.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:

ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకధాటిగా మూడ్రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని, అలాగే 26 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ కేవలం 8.8 మిమీ మందం మాత్రమే ఉండటం విశేషం.

అదిరిపోయే ప్రాసెసర్, డిస్‌ప్లే:

Advertisement

పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను వాడారు. దీనిలో 256GB స్టోరేజ్‌తో పాటు 14GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియనప్పటికీ.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో రానుంది. అంతేకాదు.. ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.

Also Read: డ్యూయల్ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న iPhone Air 2.. ఫీచర్స్ లీక్!

అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు:

Advertisement

ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా రియల్‌మీ ఈ ఫోన్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. అలాగే ఇందులో ఇన్‌బిల్ట్‌గా గూగుల్ జెమినీ లైవ్‌తో పాటు ఏఐ ఎరేజర్, ఏఐ నోట్స్ అసిస్టెంట్, ఏఐ పోర్ట్రెయిట్ లైటింగ్ వంటి ఎన్నో కృత్రిమ మేధస్సు ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఫోన్ వెనుక భాగంలో వివిధ రకాల నోటిఫికేషన్ల కోసం తొమ్మిది రంగుల్లో మెరిసే ఏఐ పల్స్ లైట్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా విశేషాలు:

ఫోన్ కింద పడినా పగలకుండా ఉండటానికి మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. అలాగే ఫొటోల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ సరికొత్త ఫోన్ ఫ్లాష్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.

Also Read: వామ్మో.. డిస్‌ప్లే లేని స్మార్ట్ బ్యాండా? Noise సరికొత్త ప్రయోగం.. ధర, ఫీచర్లు ఇవే!

Related News

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

Big Stories

Advertisement
×