E-Paper
Advertisement

భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!
Advertisement

BSNL Yatra SIM: అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ‘యాత్రా సిమ్’ (Yatra SIM)ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.196కే లభించే ఈ సిమ్ ద్వారా 15 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేని కనెక్టివిటీని పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ‘యాత్రా సిమ్’ కి సంబంధించిన పూర్తి వివరాలు, దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

యాత్రా సిమ్ బెనిఫిట్స్

బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త యాత్ర సిమ్ ను రూ.196 ధరకు 15 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే రోజుకు సుమారు రూ.13 ఖర్చుతోనే భక్తులకు కొన్ని రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్, ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ డేటా.. యాత్రా సిమ్ ద్వారా లభించనుంది. పర్వత ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్‌ను దీని ద్వారా వాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపుకునే వెసులుబాటు సైతం యాత్ర సిమ్ ద్వారా అందిస్తున్నారు.

‘యాత్రా సిమ్’ ఎలా కొనాలి?

Advertisement

అమర్ నాథ్ కు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఈ ‘యాత్రా సిమ్’ ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. యాత్రికులు దీనిని సులభంగా పొందేందుకు జమ్మూ-కశ్మీర్ వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. లఖన్‌పూర్ బేస్ క్యాంప్, జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్, బాల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల వద్ద ఈ సిమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే శ్రీనగర్‌ నౌగామ్ లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్లతో పాటు నిర్దేశిత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కేంద్రాలలో కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.

సిమ్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్

యాత్రా సిమ్ పొందేందుకు భక్తులు తప్పనిసరిగా కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ ను బీఎస్ఎన్ఎల్ వర్గాలు జారీ చేయనున్నాయి. సిమ్ కోసం.. ఆధార్ కార్డ్ లేదా పాస్ పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, యాత్రా రిజిస్ట్రేషన్ స్లిప్ ను తప్పనిసరిగా సమర్పించాలి.

Advertisement

Also Read: గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!

త్వరలో 5G సేవలు!

కేవలం తీర్థయాత్రల రూట్లలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ తన 4G నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతేకాకుండా పూర్తి స్వదేశీ సాంకేతికతతో (Indigenous Technology) రూపొందుతున్న తన 5G నెట్‌వర్క్‌ ట్రయల్స్ ను పూణే, బెంగళూరు, విశాఖపట్నం, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అధునాతన 5G సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×