E-Paper
Advertisement

క్రేజీ అప్‌డేట్.. ఫోల్డబుల్ ఫోన్లలోనే రికార్డ్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో హానర్ సరికొత్త సంచలనం!

క్రేజీ అప్‌డేట్.. ఫోల్డబుల్ ఫోన్లలోనే రికార్డ్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో హానర్ సరికొత్త సంచలనం!
Advertisement

Honor Wide Foldable: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను లీక్ చేశారు. ప్రస్తుతం ఈ లీక్స్ టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

పిచ్చెక్కించే డిస్‌ప్లే సైజ్:

లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త హానర్ ఫోల్డబుల్ ఫోన్ రెండు స్క్రీన్లతో రానుంది. దీనిలో 7.6 ఇంచుల ప్రధాన అంతర్గత (ఇన్నర్) డిస్‌ప్లేతో పాటు, బయట వైపు 5.5 ఇంచుల కవర్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ వెనుక భాగంలో హారిజాంటల్ రన్‌వే స్టైల్‌లో కెమెరా సెటప్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

200 మెగాపిక్సెల్ కెమెరా:

Advertisement

ఫొటోగ్రఫీ పరంగా ఈ ఫోన్ సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. దీనిలో ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సుదూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా జోడించనున్నారు. లీక్స్‌ నిజమైతే ఫోల్డబుల్ ఫోన్లలోనే ఇది బెస్ట్ కెమెరా ఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది.

Also Read: 6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ ఫోన్ లీక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దీని బ్యాటరీ. ఏకంగా 7,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్‌లోనూ ఇంత పెద్ద బ్యాటరీ లేదు. అంతేకాదు.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రొసెసర్‌తో వచ్చే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి.

హువావే ఫోన్‌కు గట్టి పోటీ:

హానర్ తీసుకొస్తున్న ఈ ఫోన్.. మార్కెట్లో ఇప్పటికే ఉన్న Huawei Pura X Max మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. హువావే ఫోన్‌లో 7.7 ఇంచుల ఇన్నర్ స్క్రీన్, 50MP కెమెరా, 5,300mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే హానర్ ఫోన్ అంతకంటే మెరుగైన బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో వస్తుండటంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానున్న కొన్ని నెలల్లోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

Related News

iQOO సీక్రెట్ లీక్.. భారత్ కోసం ప్రత్యేక ప్లాన్.. వేరే దేశాల్లో లేని ఫీచర్లతో Z11 లాంచ్!

భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్.. Edge 70 Max లాంచ్ కన్ఫర్మ్.. హైలైట్స్ ఇవే!

6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!

ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!

Big Stories

Advertisement
×