Nothing Phone (4b): ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ నుంచి.. ఇండియన్ మార్కెట్లో B సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ‘నథింగ్ ఫోన్ (4b)’ పేరుతో వచ్చిన ఈ మొబైల్ సరికొత్త డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘నథింగ్ ఫోన్ (4b) ఆర్‌సీబీ ఎడిషన్’ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో జరిగే ప్రత్యేక ఈవెంట్ ద్వారా ఈ ఆర్‌సీబీ ఎడిషన్‌ను సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ (4b) బేస్ వేరియంట్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) ధర రూ.34,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధరను రూ.38,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ 7.5 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. జులై 14 నుండి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 4.1 పై నడుస్తుంది. దీనికి మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. దీనిలో 6.77 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ శాంంసంగ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం ఏజీసీ డీటీ-స్టార్ 2 ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇచ్చారు.
Also Read: ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!
ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇక నథింగ్ ఫోన్ల ప్రత్యేకత అయిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఇందులోనూ హైలైట్‌గా నిలిచింది. వెనుక భాగంలో 45 మినీ-ఎల్‌ఈడీలతో కూడిన ‘గ్లిఫ్ బార్’ ఉంది. ఇది నోటిఫికేషన్లు, టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, కెమెరా కౌంట్‌డౌన్ వంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్ల కోసం ఉపయోగపడుతుంది.
ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరాతో పాటు, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అందించారు. దీని ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 6,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 80 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G సపోర్ట్ వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: అద్భుతమైన కలర్స్‌లో కేక పుట్టిస్తున్న నథింగ్ ఇయర్‌ఫోన్స్.. ఆ రెండు ఫీచర్లు నెక్ట్స్ లెవెల్ అంతే!