E-Paper
Advertisement

గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!

గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!
Advertisement

Google Maps Tips: ఈ రోజుల్లో కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా, ట్రాఫిక్ దాటుకుని ఆఫీసుకు చేరుకోవాలన్నా మొదట గుర్తొచ్చేది ‘గూగుల్ మ్యాప్స్’ (Google Maps). స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక భాగమైపోయింది. అయితే చాలామంది దీనిని కేవలం రూట్ తెలుసుకోవడానికి మాత్రమే వాడుతుంటారు. కానీ ఇందులో ప్రయాణాన్ని మరింత సులభం, సురక్షితం చేసే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అందులో 5 అతి ముఖ్యమైన అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ట్రాఫిక్ అప్‌డేట్స్..

గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌పై కనిపించే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గీతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎరుపు రంగు ఉందంటే అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఉందని అర్థం. ప్రయాణం ప్రారంభించే ముందే రూట్‌ను ఒకసారి పరిశీలిస్తే, ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్‌గా వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని (Alternative Route) సూచిస్తుంది. దీనివల్ల సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి.

ఆఫ్‌లైన్ మ్యాప్స్

Advertisement

నెట్‌వర్క్ సరిగ్గా లేని అడవులు, కొండ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో దారి తప్పకుండా ఉండాలంటే ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ (Offline Maps) ఫీచర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌ను వై-ఫై ఉన్నప్పుడే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ మీకు ఖచ్చితమైన దారిని చూపిస్తుంది.

యాడ్ స్టాప్స్

సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు మధ్యలో పెట్రోల్ బంకులు, హోటళ్లు లేదా ఏటీఎంల కోసం వెతుక్కోవడం పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. అయితే దీని కోసం జర్నీని ఆపాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ బటన్ పై క్లిక్ చేసి, మీ రూట్ మార్చకుండానే మధ్యలో ఉన్న పెట్రోల్ బంకులు లేదా రెస్టారెంట్లను ‘యాడ్ స్టాప్’ (Add Stop) ఆప్షన్ ద్వారా జోడించుకోవచ్చు. దీనివల్ల వెళ్లాల్సిన రూట్ మారకుండానే పనులు పూర్తవుతాయి.

లైవ్ లొకేషన్ షేరింగ్

Advertisement

రోడ్డు ప్రయాణాల్లో భద్రత అనేది అత్యంత ముఖ్యం. ప్రధానంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు, తెలియని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్స్‌లోని ‘షేర్ ట్రిప్ ప్రోగ్రెస్’ లేదా ‘లైవ్ లొకేషన్ షేరింగ్’ ఫీచర్‌ను యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీరు ఎక్కడికి చేరుకున్నారు, ఏ రూట్‌లో వెళ్తున్నారు అనే విషయాన్ని లైవ్‌లో ట్రాక్ చేసేందుకు వీలు కలుగుతుంది.

Also Read: ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!

కంగారు తగ్గించే ‘లేన్ గైడెన్స్’

ఫ్లైఓవర్ల దగ్గరకు వచ్చేసరికి ఏ వైపు వెళ్లాలో తెలియక చాలామంది తప్పు దారి తీసుకుంటుంటారు. ఈ సమస్యకు ‘లేన్ గైడెన్స్’ (Lane Guidance)తో చెక్ పెట్టొచ్చు. మ్యాప్స్ స్క్రీన్ పైభాగంలో మీరు ఏ లేన్‌లో వెళ్లాలో స్పష్టమైన బాణం గుర్తుల ద్వారా చూపిస్తుంది. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేసి పెట్టుకుంటే స్క్రీన్ చూడాల్సిన అవసరం లేకుండానే ఎటు తిరగాలో ముందే వాయిస్ ద్వారా గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది.

Also Read: వాషింగ్ మిషన్ కొంటున్నారా? రూ. 30 వేలలో ఇవే బెస్ట్.. మొండి మరకలైనా మాయం కావాల్సిందే!

Related News

iQOO సీక్రెట్ లీక్.. భారత్ కోసం ప్రత్యేక ప్లాన్.. వేరే దేశాల్లో లేని ఫీచర్లతో Z11 లాంచ్!

భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్.. Edge 70 Max లాంచ్ కన్ఫర్మ్.. హైలైట్స్ ఇవే!

క్రేజీ అప్‌డేట్.. ఫోల్డబుల్ ఫోన్లలోనే రికార్డ్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో హానర్ సరికొత్త సంచలనం!

6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!

Big Stories

Advertisement
×