E-Paper
Advertisement

iQOO సీక్రెట్ లీక్.. భారత్ కోసం ప్రత్యేక ప్లాన్.. వేరే దేశాల్లో లేని ఫీచర్లతో Z11 లాంచ్!

iQOO సీక్రెట్ లీక్.. భారత్ కోసం ప్రత్యేక ప్లాన్.. వేరే దేశాల్లో లేని ఫీచర్లతో Z11 లాంచ్!
Advertisement

iQOO Z11: భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియులకు iQOO సరికొత్త సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది. దేశీయ మార్కెట్లో తమ పాపులర్ Z-సిరీస్‌లో సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా హింట్ ఇచ్చింది. పేరును నేరుగా ప్రకటించనప్పటికీ.. ఇది iQOO Z11 మోడల్ అయి ఉంటుందని మార్కెట్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఐకూ ఇండియా సీఈఓ నిపున్ మర్యా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సరికొత్త ప్రాసెసర్‌తో ఎంట్రీ:

ఇప్పటికే చైనా, మలేషియా మార్కెట్లలో విడుదలైన ఈ ఫోన్.. భారత్‌కు వచ్చేసరికి కొన్ని కీలక మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వేరే దేశాల్లో విడుదలైన ఫోన్లను అలాగే ఇక్కడ లాంచ్ చేస్తుంటారు. కానీ ఐకూ ఈసారి భారత వినియోగదారుల కోసం భిన్నమైన హార్డ్‌వేర్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. చైనా వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్, మలేషియా మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అయితే, భారత్‌లో రాబోయే వేరియంట్‌లో సరికొత్త చిప్‌సెట్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్.. Edge 70 Max లాంచ్ కన్ఫర్మ్.. హైలైట్స్ ఇవే!

లీకైన బెంచ్‌మార్క్ వివరాలు:

ఇటీవల గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీనికి తోడు 12GB RAM, సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ వంటి అప్డేటెడ్ ఫీచర్లు దీనిలో ఉండనున్నాయి. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది లీక్‌స్టర్స్ మాత్రం ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తోనే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా దీని హార్డ్‌వేర్ విషయంలో స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

వివో ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షనా?

Advertisement

టెక్ వర్గాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన టాక్ ఏంటంటే.. చైనాలో విడుదలైన ‘వివో S60e’ (లేదా S60 వైటాలిటీ ఎడిషన్) మోడల్‌ను కొద్దిపాటి మార్పులతో ఇక్కడ iQOO Z11 పేరుతో తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇక కెమెరాల పరంగా చూసుకుంటే.. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా, వెనుక వైపు 50+ 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ.. రీజనబుల్ ప్రైస్:

వేరే దేశాల్లోని మోడల్స్ భారీ బ్యాటరీలతో వచ్చినప్పటికీ.. భారత వేరియంట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7,200mAh బ్యాటరీతో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. తాజా లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో రూ.30 వేల లోపు బడ్జెట్లోనే లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ టీజర్లు మొదలుపెట్టింది కాబట్టి.. రాబోయే రోజుల్లో లాంచ్ డేట్‌తో పాటు మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read: క్రేజీ అప్‌డేట్.. ఫోల్డబుల్ ఫోన్లలోనే రికార్డ్.. ఏకంగా 7000mAh బ్యాటరీతో హానర్ సరికొత్త సంచలనం!

Tags

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×