E-Paper
Advertisement

పాత ఫ్యాన్లను మార్చేయండి..కరెంట్ ఆదా చేసే సూపర్ మోడల్ వచ్చేసింది

పాత ఫ్యాన్లను మార్చేయండి..కరెంట్ ఆదా చేసే సూపర్ మోడల్ వచ్చేసింది
Advertisement

Cadlec SmartSave BLDC ceiling fan: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న కరెంట్ ఛార్జీల కారణంగా ఇళ్లలో కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం అయిపోయింది. ముఖ్యంగా సీలింగ్ ఫ్యాన్లు.. రోజంతా తిరగడం వల్ల పవర్ కన్సంప్షన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మార్కెట్‌లోకి వస్తున్నవే BLDC మోటార్ ఫ్యాన్లు. అందులోనూ ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న.. Cadlec SmartSave 1200 mm Fan ఇప్పుడు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.బడ్జెట్‌లో లభిస్తున్న ఈ ఫ్యాన్ ఇప్పుడు ఫ్లిప్ కార్డ్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. దీనిని వాడటం వల్ల కరెంట్ బిల్లు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్లు: 

కరెంట్ బిల్లు:

ఈ ఫ్యాన్ స్పెషాలిటీ ఇందులో ఉన్న లేటెస్ట్ BLDC మోటార్. సాధారణ ఫ్యాన్లతో.. పోలిస్తే ఈ ఫ్యాన్ దాదాపు 65% వరకు కరెంట్ ఆదా చేస్తుంది. అంటే మీరు రోజంతా ఫ్యాన్ వేసుకున్నా కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది. పైగా ఇది 5స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి, పెట్టిన పెట్టు బడి కొద్ది రోజుల్లోనే కరెంట్ బిల్లు రూపంలో వెనక్కి వచ్చేస్తుంది.

రిమోట్ కంట్రోల్ :

Advertisement

పాత కాలపు రెగ్యులేటర్ల టెన్షన్ లేకుండా ఈ ఫ్యాన్‌ను ఆపరేట్ చేయడానికి ఒక స్మార్ట్ రిమోట్ ఉంటుంది. సోఫాలో కూర్చుని లేదా బెడ్ మీద పడుకుని కేవలం చిన్న క్లిక్‌తో ఫ్యాన్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్/ఆఫ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు లేదా పెద్దవాళ్లు కూడా దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.

గాలి, 1200 mm సైజు:

1200 mm (48 అంగుళాలు) సైజులో వస్తున్న ఈ ఫ్యాన్ పెద్ద గదులకు కూడా పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. గది మూలమూలకు చల్లని గాలిని అందిస్తుంది. అంతే కాకుండా వేసవి ఉక్కపోత నుంచి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వైట్ కలర్ డిజైన్ ఉండటం వల్ల మీ ఇంటి ఇంటీరియర్‌కి ఇది చాలా అందమైన, క్లాసీ లుక్‌ని ఇస్తుంది. దీనిలో చాలా రంగులు కూడా అందుబాటులో  ఉన్నాయి. కాబట్టి ఇంటికి తగ్గట్టు మీరు ఫ్యాన్ ఎంచుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.799కే మెటాలిక్ లుక్..మార్కెట్‌ను షేక్ చేస్తున్న కొత్త ఇయర్‌ బడ్స్!

5 ఏళ్ల వారంటీ:

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు వారంటీ చాలా ముఖ్యం. కాడ్లెక్ సంస్థ ఈ ఫ్యాన్‌పై ఏకంగా 5 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇది ఈ ప్రొడక్ట్ మీద కంపెనీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఒక సారి దీనిని కొంటే.. ఎలాంటి టెన్షన్ లేకుండా సంవత్సరాల తరబడి ఇది హ్యాపీగా పని చేస్తుంది. తక్కువ ధరలో  ఎక్కువ టైమ్ వారంటీ దీని స్పెషాలిటీ అని చెప్పొచ్చు.

ఎందుకు కొనాలి?

మీరు తక్కువ బడ్జెట్‌లో (కేవలం రూ.2399 కే) కరెంట్ ఆదా చేసే, రిమోట్ సపోర్ట్ ఉన్న, ఎక్కువ గాలి నిచ్చే బెస్ట్ సీలింగ్ ఫ్యాన్ కోసం చూస్తుంటే ఈ ఫ్యాన్ నిస్సందేహంగా సూపర్ ఛాయిస్. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే.. ప్రీమియం ఫీచర్లను ఇస్తోంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×