Mivi DuoPods K5: స్మార్ట్ గాడ్జెట్ లవర్స్ కు గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ , ట్రెండీ లుక్ కోరుకునే వారి కోసం మార్కెట్లోకి వచ్చిన అద్భుతమైన ఇయర్‌బడ్సే ఈ మోడల్. కేవలం రూ.799 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, తమ అద్భుతమైన మెటాలిక్ ఫినిష్‌తో యూజర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్ , క్లియర్ కాలింగ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని ఫీచర్లు ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బడ్జెట్ రేంజ్ ఇయర్ బడ్స్ అయినప్పటికీ, దీనికి ఇచ్చిన మెటాలిక్ ఫినిష్ చాలా రిచ్ లుక్‌ని ఇస్తుంది. ముఖ్యంగా..’ గ్రీన్’ కలర్ వేరియంట్ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, ట్రెండ్‌గా ఉంది.ఇవి చెవుకి పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్‌గా ఫిట్ అవుతాయి.ట్రావెలింగ్, జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు వాడటానికి ఇవి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి.
పాటలు వినేటప్పుడు మంచి బేస్, క్లియర్ వాయిస్ కోరుకునే.. వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో.. అందించిన HD కాలింగ్ ఫీచర్ , AI ENC టెక్నాలజీ వల్ల.. మనం రద్దీగా ఉండే రోడ్లు లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. కేవలం రూ.799 ధరకే లభించే.. ఈ గార్జెట్ ఏకంగా 50 గంటల ప్లేటైమ్‌ను ఆఫర్ చేస్తోంది. అంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడొచ్చు. తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన టెన్షన్ ఉండదు. అలాగే లేటెస్ట్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఉండటం వల్ల ఫోన్‌తో కనెక్షన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కట్ అవ్వడం లాంటి సమస్యలు అసలు రావు.
మీరు తక్కువ ధరలో (రూ.799 కే) స్టైలిష్ లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్ , మంచి కాలింగ్ క్వాలిటీ ఉన్న ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే ఈ మోడల్ నిస్సందేహంగా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే ప్రీమియం ఫీచర్లను అందించడంలో మివి మరోసారి ముందు నిలిచింది.
ఈ ఇయర్ బడ్స్‌లో స్మార్ట్ టచ్ కంట్రోల్స్.. అందుబాటులో ఉన్నాయి. ఫోన్ తీయకుండానే కేవలం చిన్న టచ్‌తో కాల్స్ లిఫ్ట్ చేయడం, పాటలు మార్చడం లేదా వాల్యూమ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ.
గూగుల్ అసిస్టెంట్ , సిరి సపోర్ట్ దీనిలో ఉంది. వాయిస్ కమాండ్స్ ద్వారానే మీ ఫోన్‌ను ఆపరేట్ చేస్తూ పనులు చేసుకోవచ్చు.
Also Read: తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌లు
జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు లేదా జాగింగ్ చేసే సమయాల్లో చెమట పడినా, వర్షంలో చిక్కుకున్నా ఇవి పాడవకుండా సేఫ్‌గా ఉండేలా వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ ఇచ్చారు.
గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు సౌండ్ డిలే కాకుండా ఉండేందుకు లో-లేటెన్సీ మోడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.
మోడర్న్ టెక్నాలజీతో ఉన్న టైప్-సీ పోర్ట్ ద్వారా ఇవి చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. తక్కువ సమయంలోనే.. ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ పొందవచ్చు.