E-Paper
Advertisement

ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా ? అసలు విషయం తెలిస్తే..ఎప్పటికీ అలా చేయరు

ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా ? అసలు విషయం తెలిస్తే..ఎప్పటికీ అలా చేయరు
Advertisement

Charging phone with laptop: ఆఫీసులో పని చేసేటప్పుడు లేదా ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు ఛార్జర్ అందుబాటులో.. లేకపోతే, చాలా మంది ల్యాప్‌టాప్ యూజ్ చేసి తమ స్మార్ట్‌ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటారు. ఇది చాలా ఉపయోగకరంగా అనిపించినప్పటికీ, దీని వెనక ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఈ చిన్న పొరపాటు మీ ఖరీదైన ఫోన్ బ్యాటరీని, చివరికి ల్యాప్‌ టాప్‌ను కూడా దెబ్బతీసే.. అవకాశం ఉంది. అసలు ల్యాప్‌ టాప్ ద్వారా.. ఫోన్ ఛార్జ్ చేయడం ఎంతవరకు సేఫ్? దీనివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జ్ చేస్తే వచ్చే సమస్యలు ?

చాలా నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంది: ల్యాప్‌టాప్ యూఎస్‌బీ పోర్ట్‌లు సాధారణంగా తక్కువ పవర్ అవుట్‌పుట్ (సాధారణంగా 0.5A నుంచి 0.9A వరకు) ఇస్తాయి. దీని వల్ల ఫోన్ ఛార్జ్ అవ్వడానికి గంటల తరబడి సమయం పడుతుంది.

Advertisement

బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది: వోల్టేజ్ సరఫరాలో మార్పుల కారణంగా ఫోన్ బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.

ల్యాప్‌టాప్ పనితీరుపై ప్రభావం: ల్యాప్‌టాప్ బ్యాటరీ నుంచి ఫోన్‌కు పవర్ షేర్ అవ్వడం వల్ల, ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. అంతే కాకుండా ల్యాప్‌టాప్ మదర్‌ బోర్డ్‌పై ఎక్కువ భారం పడుతుంది.

Advertisement

Also Read: మొబైల్ కవర్ కొనే.. ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

ఛార్జింగ్ టిప్స్:

మీ ఫోన్ , ల్యాప్‌టాప్ రెండింటినీ సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఒరిజినల్ ఛార్జర్ : ఎప్పుడైనా సరే ఫోన్‌తో.. పాటు వచ్చే ఒరిజినల్ వాల్ ఛార్జర్ లేదా కంపెనీ సర్టిఫైడ్ ఫాస్ట్ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. మార్కెట్లో దొరికే రూ.200 నుంచి రూ.500లోపు లభించే.. లోకల్ ఛార్జర్‌లను అస్సలు వాడకండి.

పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్: మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ల్యాప్‌ టాప్‌పై ఆధారపడటానికి బదులుగా.. మంచి నాణ్యమైన పవర్ బ్యాంక్ (రూ.1,000 నుంచి రూ.2,000 ధరలో లభిస్తాయి) ఉపయోగించడం చాలా మంచిది.

డైరెక్ట్ వాల్ సాకెట్: వీలైనప్పుడల్లా గోడకు ఉండే డైరెక్ట్ పవర్ సాకెట్‌కు ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేయడం కూడా మంచిది.

అత్యవసర పరిస్థితుల్లో ఒకట్రెండు సార్లు ల్యాప్‌ టాప్‌తో ఛార్జ్ చేయడం పెద్దగా సమస్య కాకపోయినా.. దీనిని తరచూ అలవాటుగా మార్చుకోవడం మాత్రం మీ ఫోన్‌కు చాలా ప్రమాదకరకం. కాబట్టి సరైన ఛార్జింగ్ పద్ధతులను పాటించి మీ ఖరీదైన గ్యాడ్జెట్లను కాపాడుకోండి.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×