E-Paper
Advertisement

‘జై శ్రీ రామ్’ వివాదం.. అనసూయపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?

‘జై శ్రీ రామ్’ వివాదం.. అనసూయపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
Advertisement

Anasuya:న్యూస్ రీడర్గా కెరియర్ ఆరంభించి.. జబర్దస్త్ వ్యాఖ్యాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న అనసూయ (Anasuya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై గ్లామర్ వలకబోస్తూ తనదైన నటనతో, అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది అనసూయ. అంతేకాదు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ వివాదాలలో చిక్కుకుంటున్న ఈమె ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకుంది. పైగా ఈమె ఆదిలాబాద్ కి ఒక షాపు ఓపెనింగ్ కి వస్తోందని తెలుసుకొని ఫ్లెక్సీలను చింపేస్తూ.. ప్రజలు మండిపడ్డారు.. మరి అసలు ఏం జరిగింది? అనసూయ పై ప్రజలు ఎందుకు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జై శ్రీరామ్ వివాదం..

విషయంలోకి వెళ్తే.. అనసూయ ఇటీవల తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ” జై శ్రీరామ్ పేరుతో కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. సనాతన ధర్మం ముసుగులో పెద్ద దొంగలు కూడా ఉన్నారు.” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. దీనిపై విమర్శలు రావడంతో తన మాటలను వక్రీకరిస్తున్నారని, తాను అందరు హిందువుల గురించి మాట్లాడలేదని మరో వీడియో విడుదల చేసింది. కేవలం మతం పేరుతో అరాచకాలు చేస్తున్న కొంతమంది గురించి చెప్పానని కూడా చెప్పుకొచ్చింది. తాను రాముడు భక్తురాలిని అని.. తన కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని కూడా తెలిపింది.

Advertisement

also read:పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ.. ఏ పార్టీలో అంటే?

అనసూయ పై కేసు ఫైల్..

అయితే అనసూయ ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ.. ఆమె వ్యాఖ్యలు మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెపై కేసు కూడా ఫైల్ అయింది. బిజెపి నాయకులు హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. మతపరమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ బిజెపి నాయకులు పేర్కొన్నారు.

అదిలాబాదులో అనసూయ ఫ్లెక్సీలు చించేసిన ప్రజలు..

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా అనసూయ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆదిలాబాద్ ప్రజలు. విషయంలోకి వెళ్తే.. అదిలాబాద్ జిల్లాలో ఒక షాప్ ఓపెనింగ్ కి అనసూయ రాబోతోందని తెలుసుకున్న ప్రజలు, కాషాయ కండువా వేసుకున్న వ్యక్తులు పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్ వద్దకు చేరుకొని.. ఆమె రాక కోసం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చింపేసి, కట్టిన కటౌట్లను దగ్ధం చేస్తూ.. ఆమె ఫోటోలను కిందపడేసి మరీ తొక్కేశారు. శ్రీరాముడి పై తప్పుడు మాటలు మాట్లాడిన అనసూయ షాప్ ఓపెనింగ్ చేయడం ఏంటి? అంటూ తమదైన శైలిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ ఘటనపై అనసూయ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×