Honor Band 11 Series: ఫిట్‌నెస్ ప్రియుల కోసం ప్రముఖ టెక్ సంస్థ హానర్ సరికొత్త ‘హానర్ బ్యాండ్ 11’ సిరీస్‌ను చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో లాంచ్ కానుంది. ఈసారి హానర్ ఒకేసారి మూడు మోడళ్లను పరిచయం చేస్తోంది. అందులో Honor Band 11, Honor Band 11 Proలతో పాటు ప్రత్యేకంగా Honor Band 11 Pro GPS Edition కూడా ఉంది.
ఈ కొత్త సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ Pro GPS Edition. సాధారణంగా స్మార్ట్ బ్యాండ్లలో రన్నింగ్ లేదా సైక్లింగ్ రూట్‌ను ట్రాక్ చేయాలంటే ఫోన్ వెంట ఉండాల్సిందే. కానీ ఈ కొత్త ఎడిషన్‌లో ఇన్‌బిల్ట్ GPS ఇచ్చారు. దీంతో ఫోన్ ఇంట్లోనే వదిలేసి రన్నింగ్, సైక్లింగ్ లేదా హైకింగ్ వెళ్లినా.. మన వర్కవుట్ రూట్, దూరం, ఇతర వివరాలను బ్యాండ్ ఒక్కటే స్పష్టంగా రికార్డు చేస్తుంది.
Also Read: సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి ఈ మూడు మోడళ్లలోనూ ముఖ్యమైన ఫీచర్లు సమానంగా ఉన్నాయి. ముఖ్యంగా బాడ్మింటన్ ఆడేవారి కోసం ప్రత్యేకంగా ఒక స్పోర్ట్ మోడ్‌ను దీనిలో చేర్చారు. దీంతో పాటు రాత్రి వేళల్లో నిద్ర నాణ్యతను కొలిచే స్లీప్ మానిటరింగ్ ఫీచర్ కూడా ఉంది. కంపెనీ ఇంకా పూర్తి స్థాయి సెన్సార్ల వివరాలను వెల్లడించలేదు కానీ, లాంచ్ సమయంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
ఈ కొత్త సిరీస్‌లో బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. సాధారణ Honor Band 11 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల పాటు పనిచేస్తుంది. ఇక Pro, Pro GPS Edition మోడళ్లు అయితే ఏకంగా 26 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. మార్కెట్లో దొరికే అత్యుత్తమ ఫిట్‌నెస్ బ్యాండ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ సమయం అని చెప్పవచ్చు.
గతంలో వచ్చిన Honor Band 10 కంటే ఇవి చాలా మెరుగైన ఫీచర్లతో వస్తున్నాయి. ఇక రంగుల విషయానికొస్తే.. Band 11 మోడల్ సీ సాల్ట్ వైట్, టారో పర్పుల్, క్యావియర్ షేడ్స్‌లో లభిస్తుంది. ఇక Pro మోడళ్లు ఆల్మండ్ వైట్, కోకో బ్లాక్, అవకాడో రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన బ్యాటరీ, ఇన్‌బిల్ట్ GPS లాంటి ఫీచర్ల వల్ల ఈ కొత్త సిరీస్ ఫిట్‌నెస్ లవర్స్‌ను బాగా ఆకట్టుకునేలా ఉంది.
Also Read: భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!