Coocaa 55 inch Ultra HD 4K Mini LED Smart TV: ఇంటి దగ్గరే సినిమా ఫీల్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం.. మార్కెట్లో ట్రెండీ ఫీచర్లతో ఉన్న లార్జ్ స్క్రీన్ టీవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. కస్టమర్ల బడ్జెట్‌కు తగ్గట్టుగా.. అద్భుతమైన విజువల్స్ అందించడంలో ‘కూకా'(Coocaa)బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సరి కొత్త టెక్నాలజీతో వస్తున్న కూకా 138 సెంమీ (55 ఇంచ్) అల్ట్రా హెచ్‌డీ (4K) మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ప్రస్తుతం మార్కెట్2లో ట్రెండ్ సెట్ చేస్తోంది. దీని అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, ప్రీమియం డిజైన్, బడ్జెట్ ధర కారణంగా ఇది మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీవీ ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.మినీ ఎల్ఈడీ టెక్నాలజీ:
ఈ టీవీ ప్రధాన ప్రత్యేకత దాని డిస్‌ప్లే టెక్నాలజీ. మినీ ఎల్ఈడీ ప్యానెల్ మరియు క్యూఎల్‌ఈడీ (QLED) కాంబినేషన్‌తో ఇది వస్తుంది. దీనివల్ల చీకటి గదిలో కూడా రంగులు అత్యంత స్పష్టంగా, సహజసిద్ధంగా కనిపిస్తాయి. లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల కాంట్రాస్ట్ రేషియో చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ , హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ లభించడం వల్ల సినిమాలోని ప్రతి సీన్ కళ్ళ ముందు కదులుతున్న అనుభూతి కలుగుతుంది.
కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా.. సౌండ్ విషయంలోనూ ఈ టీవీ అదరగొడుతుంది. ఇందులో.. ఉండే స్పీకర్లు మొత్తం 36 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. దీనికి తోడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్ , డైలాగ్స్ చాలా స్పష్టంగా,లీనమయ్యేలా వినిపిస్తాయి. గేమింగ్ లవర్స్ కోసం ఇందులో 120Hz గేమ్ ఆక్సిలరేటర్ ఫీచర్ ఇచ్చారు. కాబట్టి ఇది గేమింగ్ ఫీల్‌ను మరింత ఈజీ చేస్తుంది.
Also Read: టెక్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్..మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 గోబోల్ట్ వాచ్‌లు!
ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇందులో.. 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం వల్ల టీవీ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. వాయిస్ కంట్రోల్ సపోర్ట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ వంటి లేటెస్ట్ హంగులు దీని సొంతం.
4.ధర:
ధర విషయానికి వస్తే.. అన్ని ట్రెండీ ఫీచర్లతో వస్తున్న ఈ కూకా 55 ఇంచ్ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ మార్కెట్లో సుమారు రూ.35,999 ధర వద్ద లభిస్తుంది.ఫీచర్ల పరంగా చూస్తే ఈ ధర ఇది ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం థియేటర్ ఫీల్ కోరుకునే.. కుటుంబాలకు ఈ కూకా 55 ఇంచ్ 4కే మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.