E-Paper
Advertisement

వందే భారత్ స్లీపర్‌పై బిగ్ అప్డేట్.. 24 బోగీల రైలు వచ్చేస్తోంది!

వందే భారత్ స్లీపర్‌పై బిగ్ అప్డేట్.. 24 బోగీల రైలు వచ్చేస్తోంది!
Advertisement

24 Coach Vande Bharat Sleeper Trains: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయంలో మరో కీలక ముందడుగు పడింది. 24 బోగీలతో కూడిన వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ఉత్పత్తికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధమవుతోంది. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ మనీష్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో సుదూర ప్రయాణాలకు అనువుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను విస్తరించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 24 కోచ్‌ల రైలు తయారీ ప్రారంభం కానుండటం స్లీపర్ రైళ్ల ప్రాజెక్టులో ముఖ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.

50 రైలు సెట్ల తయారీ

చెన్నైలోని ఐసీఎఫ్‌లో 24 బోగీల వందే భారత్ స్లీపర్ రైలు సెట్ల ఉత్పత్తి చేపట్టనున్నారు. మొత్తం 50 రైలు సెట్లను తయారు చేసే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. వీటి ద్వారా దేశంలోని పలు ముఖ్యమైన నగరాలను స్లీపర్ వందే భారత్ సేవలతో అనుసంధానించే అవకాశం ఉంది. సాధారణ వందే భారత్ రైళ్లకు భిన్నంగా స్లీపర్ వెర్షన్‌ లో ప్రయాణికులు రాత్రి సమయంలో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్త్‌ లను ఏర్పాటు చేస్తారు. దీర్ఘదూర ప్రయాణాలకు ఈ రైళ్లు ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఒకే స్లీపర్ వందే భారత్

Advertisement

ప్రస్తుతం దేశంలో ఒక వందే భారత్ స్లీపర్ రైలు మాత్రమే సేవలు అందిస్తోంది. హౌరా–కామాఖ్య మధ్య నడుస్తోంది. ఈ రైలు మొత్తం 16 బోగీలతో ఉంటుంది.ఈ 16 కోచ్‌ల రైలు సెట్‌లో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, నాలుగు సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలను బట్టి వేర్వేరు తరగతుల్లో బెర్త్‌ లను అందిస్తున్నారు.

త్వరలో మరిన్ని స్లీపర్ రైళ్లు

రాబోయే నెలల్లో దేశంలోని మరిన్ని మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్లీపర్ రైలుకు వచ్చిన స్పందన, ప్రయాణికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సర్వీసులను పెంచే అవకాశం ఉంది. 24 బోగీల రైలు సెట్ అందుబాటులోకి వస్తే ఒక్కో రైలులో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీంతో రద్దీగా ఉండే సుదూర మార్గాల్లో ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారవచ్చు.

ప్రయాణికులకు పెరగనున్న అవకాశాలు

Advertisement

వందే భారత్ స్లీపర్ రైళ్ల సంఖ్య పెరిగితే విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకునే వారికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో సమయాన్ని ఆదా చేసుకుంటూ సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవాలనుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి. 24 బోగీల వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి ప్రారంభమైతే దేశ రైల్వే రంగంలో మరో కీలక దశ మొదలైనట్లే. రాబోయే రోజుల్లో వీటిని ఏయే మార్గాల్లో నడుపుతారనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also: తెలంగాణకు గుడ్ న్యూస్.. 2 అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×