E-Paper
Advertisement

Cosmic Objects : పరిశోధనల పద్ధతిని మార్చిన శాస్త్రవేత్తలు.. మరింత మెరుగ్గా..

Cosmic Objects : పరిశోధనల పద్ధతిని మార్చిన శాస్త్రవేత్తలు.. మరింత మెరుగ్గా..
Advertisement
Cosmic Objects

Cosmic Objects : మన కంటికి కనిపించే వస్తువులతో పాటు ఎన్నో కంటికి కనిపించని వస్తువులు కూడా భూమిపైన ఉన్నాయి. ముఖ్యంగా అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చిన ఎన్నో వస్తువులు సాధారణ కంటితో కనిపించవు. అలాంటి వస్తువులను స్టడీ చేయడానికి శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా ఒక ప్రక్రియ ద్వారా ఇలాంటి కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌పై పరిశోధనలు నిర్వహించవచ్చని వారు కనిపెట్టారు.

కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌పై పరిశోధనలు చేయడం అంత సులభం కాదు. మైక్రోస్కోప్‌లాంటి పరికరాలు కూడా వాటి స్టడీకి కొంతవరకే ఉపయోగపడతాయి. అయితే రకరకాల యంత్ర అభ్యాస పద్ధతుల ద్వారా ఎక్స్‌రే వేవ్‌లెన్త్‌లో కనిపించే కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌ను స్టడీ చేయడం సులభమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ యంత్ర అభ్యాస పద్ధతులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)లో ఒక భాగమే అని వారు అన్నారు.

Advertisement

ఇంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రానమీ కొత్త దారిలో ప్రయాణిస్తోంది. కాస్మిక్ ఆబ్జెక్ట్స్ నుండి సేకరించిన డేటా.. ఆస్ట్రానమీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. దానిపై పరిశోధనలు చేయాలనుకునేవారికి కూడా ఈ డేటా అందుబాటులో ఉంటోంది. ఈ డేటా ద్వారా ఎన్నో కొత్త పరిశోధనలు, అన్వేషణలు కూడా ప్రారంభమవుతున్నాయి. ప్రపంచాన్ని చూసే దృక్పథం కూడా ఈ పరిశోధనల వల్ల ఎంతగానో మారుతోంది. శాస్త్రవేత్తలు ఈ కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌పై ఎన్ని పరిశోధనలు చేసినా.. దీని నుండి డేటాను సంపాదించడానికి ఒక మెషీన్ సాయం ఎంతగానో అవసరం.

అమెరికాలోని చంద్రా స్పేస్ అబ్జర్వేటరీ వారు చేసిన ఎక్స్‌రేలలో కనిపెట్టిన కాస్మిక్ ఆబ్జెక్ట్స్‌పై ఇండియా కూడా పరిశోధనలు చేయాలని నిర్ణయించుకుంది. కొత్త కొత్త పద్ధతుల్లో యంత్రాలతో వీటిని పరీక్షించి చూసింది. అప్పుడే వారు పరిశోధనల్లో వచ్చిన డెవలప్‌మెంట్‌ను గమనించారు. ఈ పరిశోధనల ద్వారా వారు కాస్మిక్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న తేడాలను కూడా కనిపెట్టగలిగారు. దీని ద్వారా వారు ఎన్నో బ్లాక్ హోల్స్, న్యూట్రన్ స్టార్స్, స్టార్స్ వంటి ఎన్నో విషయాలపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఆస్ట్రానమీలో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. పలు అబ్జర్వేటరీల నుండి వచ్చే డేటాను స్టడీ చేయడానికి ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×