E-Paper
Advertisement

Cyber Calls : ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్త! జాగ్రత్త! ఈ నెంబర్స్ అస్సలు లిఫ్ట్ చెయ్యుద్దు!

Cyber Calls : ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్త! జాగ్రత్త! ఈ నెంబర్స్ అస్సలు లిఫ్ట్ చెయ్యుద్దు!
Advertisement

Cyber Calls : రోజు రోజుకి సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని టెలికాం యూజర్లకు కేంద్రం సూచించింది.

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో సైబర్ మోసాలకు అడ్డు లేకుండా పోతుంది. ప్రభుత్వ అధికారులమంటూ కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు మరింత పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్.. ఇలా ఎన్నో ఆన్లైన్ మోసాలకు అదుపు లేకుండా ఉంది. ఇప్పటికే ఎందరో డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్లలో పోగొట్టుకున్నారు. ఆన్లైన్ మోసాలతో విద్యార్థుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల వరకూ మోసపోతూనే ఉన్నారు.

Advertisement

ఆన్ లైన్ లో ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్న ఈ సమయంలో టెలికామ్ యూజర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గుర్తు తెలియని అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. టెలికాం ఆపరేటర్లు సైతం అంతర్జాతీయ కాల్స్ ను సూచించే విధంగా వినియోగదారులకు అవగాహన కల్పించాలని చెప్పుకు వచ్చింది.

కేంద్రం తాజాగా ఈ ఏడాది అక్టోబర్ 22న ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. భారతీయ ఫోన్ నెంబర్లతోనే అంతర్జాతీయ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అడ్డుకట్ట వేయటానికి ఈ డాట్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. దీంతో కేవలం 24 గంటల్లోనే సుమారు 1.35 కోట్ల ఫోన్ నెంబర్లను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేశారని ఈ సంస్థ తెలిపింది. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్తదారులు ఎంచుకున్నారు.

Advertisement

ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ నెంబర్లను వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా టెలికాం నంబర్లకు ముందు వచ్చే + 91 తో కాకుండా వేరే కోడ్స్ తో కాల్స్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది.

అంతర్జాతీయ కాల్స్ లో +8, + 85, + 65 వంటి నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. ప్రభుత్వ అధికారులమంటూ వాట్సప్ లో వచ్చే కాల్స్ ను అస్సలు నమ్మొద్దని తెలిపింది. వీడియో కాల్స్ ను లిఫ్ట్ చేయొద్దని, అనుమానంగా ఉన్న నెంబర్స్ ను వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చింది.

సంచార సాథి పోర్టల్ లో చక్షు లో రిపోర్ట్ చేస్తే నేరాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకు వచ్చింది. టాస్క్ ఫోర్స్ సైతం ఏర్పాటు చేశామని నేరాలను మరింతగా అట్టుకట్ట వేస్తామని తెలిపింది. ఇక ఇలాంటి నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ కి ఇంటర్నేషనల్ కాల్స్ అంటూ చూపించే ఆఫ్షన్ ను సదరు సంస్థలు చూపించాలని తెలిపింది. ట్రాయ్, పోలీస్, ఇన్కమ్ టాక్స్ అధికారాలమంటూ అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయొద్దని, airtel ఇప్పటికే ఇలాంటి వాటిపై కట్టడి చర్యలు చేపట్టిందని, ఇతర కంపెనీలు సైతం ఈ విధానాన్ని ఫాలో అయ్యి నేరాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం సూచించింది.

ALSO READ : వాట్సాప్ లోనే డాక్యుమెంట్ స్కానర్… ఎలా ఉపయోగించాలంటే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×